BigTV English

Causes of Itching: అక్కడ దురద పెడుతోందా..? కారణం ఏమిటో తెలుసా..?

Causes of Itching: అక్కడ దురద పెడుతోందా..? కారణం ఏమిటో తెలుసా..?

Cause of Itching: మర్మాంగాలలో దురద ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో దీనికన్నా నరకం బెటర్ అనిపిస్తుంది. పదే పదే అక్కడ చేతులు వేసి గోకడం వల్ల చాలా అసహ్యంగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు దీనికి గల కారణాలను తప్పక తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఈ గజ్జల్లో దురదలు, మంట ఎందుకు వస్తుందో తెలుసుకోండి.


మనలో కొందరికి మర్మాంగాల దురద,మంటలు వస్తుంటాయి. ఇది క్యాండిడా ఆల్బికన్స్‌గా అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఈ సమస్యల మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది.సాధారణంగా క్యాండిడా ఆల్బికన్స్‌ ఫంగస్ మనుషుల్లోని సూక్ష్మజీవులతో కలిసి జీవిస్తుంది. మన శరీరంపై జీవించే అనేక సూక్ష్మజీవుల్లో ఇవి కూడా ఒకటి. ఇదో రకమైన ఫంగస్.

ఈ ఫంగస్‌ను అవకాశవాద సూక్ష్మజీవిగా చెబుతారు. అంటే సమయం అనుకూలంగా ఉండేటప్పుడు ఇవి తమ సంఖ్యను వృద్ధి చేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటి సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు.. శరీరంలో సమతౌల్యం దెబ్బతింటుంది. అప్పుడే క్యాండిడయాసిస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది.


Also Read: ఈ ఆకుకూర తింటే.. ఎప్పటికి కుర్రాళ్లే!

అయితే మహిళల్లో ఈ ఫంగస్ విపరీతంగా పెరుగుతుంది. ఇందుకు రుతుచక్రం, గర్భధారణ సమయాల్లో హార్మోన్లు అసమతౌల్యం కావడం, హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్ వాడటం, హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీలు యోనిలోని పీహెచ్ స్థాయులను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా క్యాండిడా ఆల్బికన్స్‌ ఫంగస్ వృద్ధి చెందుతుంది.

ఇక పురుషుల విషయానికి వస్తే.. చెమట, తడి బట్టలు వేసుకోవడం, లోదుస్తులు వల్ల పురుషాంగంపై చెమ్మ ఏర్పడంతో ఫంగస్ వృద్ధి చెందే ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా మర్మాంగాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం మర్మాంగం చివరి భాగాన్ని చర్మం ఎక్కువగా కప్పి ఉంచడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది.

Also Read: ఈ పువ్వుతో షుగర్ క్షణాల్లో మాయం.. కనిపిస్తే వదలకండి!

క్యాండిడా ఆల్బికన్స్‌వల్ల మహిళల్లో తెల్లని ద్రవం యోని నుంచి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు మర్మాంగాల్లో మంటలు, మూత్రం పోసేటప్పుడు అసౌకర్యం, సెక్స్ సమయంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మగవారిలో అయితే, పురుషాంగంపై చిన్న ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. చుక్కల మాదిరిగా పుండ్లు కూడా అవుతాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ విపరీతంగా దురద కనిపిస్తుంది. శృంగారం సమయంలో ఇన్ఫెక్షన్ సోకిన చర్మాన్ని తరచూ తాకడం వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Disclaimer : ఈ కథనాన్ని నిపుణుల సలహాల మేరకు అందిస్తున్నాం. దీన్ని సాధారణ సమాచారంగా మాత్రమే భావించండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×