Carrot Face Pack: క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలికాలంలో క్యారెట్లు ఎక్కువగా లభిస్తాయి. క్యారెట్‌తో రుచికరమైన తీపి వంటకాలు తయారు చేయవచ్చు. క్యారెట్ చర్మానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా ? అవును, క్యారెట్‌ని చాలా రకాలుగా ముఖానికి కూడా అప్లై చేయవచ్చు. చర్మ సౌందర్యానికి క్యారెట్ ఎంతగానో మేలు చేస్తుంది. క్యారెట్ తినడం వల్ల ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. క్యారెట్‌తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి ఫేస్ ప్యాక్ :
కావాల్సినవి:
క్యారెట్ రసం- 2 టేబుల్ స్పూన్లు
పెరుగు- 1 టీ స్పూన్
ఎగ్ వైట్ – 1
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి మీకు క్యారెట్ రసం అవసరం. అంతే కాకుండా పెరుగు, గుడ్డులోని తెల్లసొన కూడా అవసరం అవుతాయి. ఈ ప్యాక్ తయారు చేయడానికి, 2 టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్ తీసుకోండి. ఈ జ్యూస్ కోసం క్యారెట్ తురుమును కాటన్ క్లాత్‌లో వేసి బాగా పిండాలి. తర్వాత పెరుగు, గుడ్డులోని తెల్లసొన వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ శుభ్రమైన ముఖం, మెడపై అప్లై చేయండి. కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఫేస్ ప్యాక్‌ను ముఖంపై ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.
రెండవ ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
క్యారెట్ రసం- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
Also Read: మీరూ.. ఈ పొరపాట్లు చేస్తున్నారా ? ముఖం పాడైపోతుంది జాగ్రత్త
తయారు విధానం:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి క్యారెట్ గుజ్జును తీసుకుని అందులోనే పైన చెప్పిన మోతాదులో తేనె, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ యొక్క పలుచని పొరను శుభ్రమైన ముఖంపై అప్లై చేసి, కాసేపు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో మాస్క్‌ను తొలగించండి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు కూడా ఉపయోగించవచ్చు. క్యారెట్ ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.