Naa Anveshana :నా అన్వేషణ.. ప్రపంచ యాత్రకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక యూట్యూబర్ అన్వేష్.. దేశాలు తిరుగుతూ ఏ ఏ దేశంలో ఎక్కడెక్కడ చౌకబారు వస్తువులు లభిస్తాయో అనే విషయాన్ని తెలియజేస్తూ.. ప్రపంచంలో నలుమూలల ఉండే వింతలు విశేషాలను చూపిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే తాజాగా దుబాయ్ కి వెళ్లిన ఆయన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమాలు చూసి.. వాటి రివ్యూలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యూట్యూబర్ ఇచ్చిన రివ్యూ కూడా మనం ఒకసారి చూద్దాం.
రివ్యూ తో నవ్వులు పూయించిన అన్వేష్..
నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ లో దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియో రిలీజ్ చేసిన అన్వేష్.. అందులో ఒకే రోజు రాంచరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్, బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్’ సినిమాలు చూశారు. ఇకపోతే మొదట రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టికెట్ తీసుకున్న అన్వేష్.. థియేటర్ ఫుల్ అయిపోయి ఉంటుంది.. “అందరూ వచ్చి ఉంటారు అంటూ చాలా వేగంగా పరిగెడుతూ ఉంటారు.. అయితే థియేటర్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్కడ కనీసం ఒక్క సీటు కూడా ఫుల్ అయి ఉండదు. ఇక ఇది చూసిన ఈయన నాకోసం దుబాయ్ రాజు గారు థియేటర్ ను ఖాళీగా ఉంచేశారు” అంటూ నవ్వులు పూయించారు. ముఖ్యంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి ఆ థియేటర్లో ఒక్క ఆడియన్ కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.
నిరాశలో రామ్ చరణ్ ఫ్యాన్స్..
ఇక డాకు మహారాజ్ సినిమా కూడా చూశారు. ఇక ఆ సినిమా చూడడానికి బాలయ్య అభిమానులు ఒక మోస్తారుగా వచ్చారు. ఇక అక్కడి వారితో మాటామంతి పెట్టుకున్న ఈయన కొద్దిసేపు జై బాలయ్య అంటూ ఆడియన్స్ చేత పలికించారు.అలా మొత్తానికైతే రెండు సినిమాలు చూశానని, రెండు కూడా బాగున్నాయని చెప్పాడు. కానీ ఈ సినిమాలకు అక్కడున్న రెస్పాన్స్ ఏంటో కూడా తెలియజేయడంతో ఈ విషయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు కాస్త అసహనం, నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు..
ఒక గేమ్ చేంజర్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేసిన సినిమా ఇది. శంకర్ దర్శకత్వంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా.. దాదాపు 17 మంది హీరోలు ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరొకవైపు బాలకృష్ణ డాకు మహారాజ్.. ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశీ రౌతేలా, ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్లుగా, బాబీ డియోల్ విలన్ గా నటించిన చిత్రం ఇది. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు కానీ అవే మాస్, యాక్షన్ సన్నివేశాలు బాలయ్య అభిమానులను బాగా మెప్పించాయి అని చెప్పవచ్చు. ఇక మొత్తానికైతే నా అన్వేషణ యూట్యూబర్ ఇచ్చిన రివ్యూ పక్కన పెడితే.. దుబాయిలో అక్కడి ప్రజల నుండి ఈ సినిమాలకు వస్తున్న స్పందన చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
(17వ నిమిషం నుంచి….)