మనదేశంలో స్నానం చేయకుండా పచ్చి మంచినీళ్లు కూడా తాగని వారు ఎంతోమంది. ఉదయం తెల్లవారుజామునే లేచి శుద్ధిగా స్నానం చేసి పూజలు చేసుకున్న తర్వాతే మంచి నీళ్లు అయినా తాగుతారు. ఉదయం స్నానం చేయడమే మన భారత దేశంలో సాంప్రదాయంగా ఉంది. ఇలా తెల్లవారుజామునే స్నానం చేయడం వల్ల శరీరం మనసు రెండు ఉల్లాసంగా ఉంటాయని ఒక నమ్మకం. అయితే మన పొరుగు దేశాలైన చైనా, జపాన్, కొరియాలలో మాత్రం ప్రజలు ఉదయం పూట స్నానం చేయరు. సాయంత్రం లేదా రాత్రిపూట మాత్రమే స్నానం చేస్తారు.
జపాన్, చైనా, కొరియాలలో పురాతన కాలం నుండి రాత్రి స్నానమే అలవాటుగా ఉంది. పగటిపూట స్నానం చేయడం వారికి తెలియదు. ఉదయం లేచాక బ్రష్ చేసుకుని ముఖం కడుక్కొని దుస్తులు వేసుకొని ఆఫీసులకు వెళ్లిపోతారు. ఆఫీసుల నుంచి వచ్చాక రాత్రిపూట స్నానం చేస్తారు. వారి ఉద్దేశం ప్రకారం రాత్రిపూట స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుందని, ఒత్తిడి తగ్గుతుందని, మంచి నిద్ర పడుతుందని చెప్పకుంటారు.
జపాన్లో
జపాన్ లో రాత్రి స్నానం ఒక ఆచారంగా మారింది. జపనీస్ సంస్కృతిలో నిద్రపోయే ముందు కచ్చితంగా స్నానం చేయాలి. ఇది మానసిక, శారీరక శుద్ధికి చిహ్నంగా చెప్పుకుంటారు. అక్కడి ప్రజలు రాత్రిపూట స్నానం చేయడం వల్ల పగటిపూట పడిన అలసట తొలగిపోయి మంచి నిద్ర వస్తుందని నమ్ముతారు.
చైనాలో
చైనాలో రాత్రిపూట స్నానం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు. అక్కడ వాతావరణం తేమగా ఉంటుంది. ఇది చెమట, బ్యాక్టీరియా ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రిపూట స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుందని, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని వారి నమ్మకం. రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గితే నిద్ర బాగా పడుతుందని… దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని వారు నమ్ముతారు. అందుకే వారు రాత్రిపూట మాత్రమే స్నానం చేస్తారు.
నిజానికి ఉదయం, రాత్రి రెండు పూటలా స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదే. రాత్రిపూట స్నానం చేయడం వల్ల పగటిపూట శరీరానికి పట్టిన మురికి చెమట తొలగిపోతుంది. ఒత్తిడి కూడా తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కండరాలు విశ్రాంతి పొందుతాయి. మంచి నిద్ర పడుతుంది.
Also Read: వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో.. పెట్టకూడదు తెలుసా ?
స్నానం చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోజు ప్రారంభాన్ని శక్తివంతంగా మొదలుపెడుతుంది. శరీరం తాజాగా అనిపిస్తుంది. మానసికంగా చురుకుదనం వస్తుంది. చెమట దుర్వాసన, బ్యాక్టీరియా వంటివి రావు. రాత్రంతా శరీరం నిద్రావస్థలో ఉంటుంది. ఉదయాన ఉత్సాహంగా మారాలంటే స్నానం చేయాల్సిందే.
సైన్స్ ఏం చెబుతోంది?
రాత్రిపూట స్నానం చేయడం ప్రయోజనకరమని సైన్స్ కూడా భావిస్తోంది నిద్రపోయే ముందు వేడి స్నానం చేయడం వల్ల కండరాలు సడలించి, నిద్రా నాణ్యత మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయం స్నానం కూడా ముఖ్యమే. ఉదయం స్నానం చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అవసరాలను బట్టి ఎప్పుడు స్నానం చేయాలో నిర్ణయించుకోండి.