IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ఐపిఎల్ 18వ సీజన్ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్ లో కీలక ఆటగాళ్లు అంతా ఫ్రాంచైజీలు మారడంతో ఈ ఏడాది ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీజన్ లో తొలి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ కి కలకత్తా ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
Also Read: IND VS NZ Final: వరుసగా రెండు క్యాచ్ లు మిస్… గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన షమీ..!
అలాగే హైదరాబాద్ వేదికగా కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. మార్చ్ 22 నుండి ఈ ఐపీఎల్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కలకత్తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇక రెండవ మ్యాచ్ ఐపీఎల్ 2024 రన్నర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మార్చి 23 మధ్యాహ్నం హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం {ఉప్పల్} లో జరగనుంది.
ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో మార్చి 24న లక్నోతో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి షాక్ ఇచ్చాడు ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్. తాను ఐపీఎల్ 2025 సీజన్ లో ఆడడం లేదని ప్రకటించాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో కూడా వ్యక్తిగత కారణాలతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు ఈ ఇంగ్లాండ్ ఆటగాడు హ్యరి బ్రూక్. దీంతో ఇతడి స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ నీ జట్టులోకి తీసుకున్నారు.
అప్పుడు విలియమ్స్ ని కనీస బేస్ ధర 50 లక్షల కు సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక హ్యరీ బ్రూక్ నీ ఢిల్లీ క్యాపిటల్స్ 4 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 ఐపీఎల్ సీజన్ లో బ్రూక్.. తన అమ్మమ్మ చనిపోయిందని మేనేజ్మెంట్ కి తెలియజేసి ఐపీఎల్ నుండి వైదొలిగాడు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని 6.25 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read: IND VS NZ Final: టీమిండియా గెలవాలని వేడి వేడి మూకుడులో కూర్చున్న బుడ్డోడు !
కానీ ఈ సీజన్ కి కూడా తాను దూరం కానున్నట్లు తాజాగా ప్రకటించాడు. అయితే దేశానికి ఆడడమే తన ప్రాధాన్యత అని, రాబోయే సీజన్ల కోసం ప్రిపేర్ అయ్యేందుకే ఐపిఎల్ కి దూరం అవుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే యాక్షన్ లో ఎంపిక అయి టోర్నీలో పాల్గొనకపోతే రెండేళ్ల పాటు నిషేధం విధిస్తామని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవల ఓ కొత్త రూల్ ని తీసుకువచ్చింది. దీంతో అతనిపై రెండు సీజన్ల పాటు నిషేధం విధించనుంది. ఈనెల 22వ తేదీ నుండి ఈ ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా ఈవెంట్ కి మొత్తం 13 వేదికలు సిద్ధం చేశారు. ఈ సీజన్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలు పెట్టేసాయి. డొమెస్టిక్ ప్లేయర్లతోపాటు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ప్రిపరేషన్ లో పాల్గొంటున్నారు.