Honda SP125 : ప్రముఖ బైక్ తయారీ సంస్థ హోండా కొత్త ఎస్‌పీ 125ని లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.91 వేలుగా తెలిపిన ఆ సంస్థ ఫీచర్స్ తో పాటు ఇతర వివరాలను వెల్లడించింది.
ప్రముఖ టు వీలర్ తయారీ కంపెనీ హోండా ఎప్పటికప్పుడు ఇండియాలో తన మార్కెట్ ను పెంచుకునే దిశగా కొత్త కొత్త మోడల్ బైక్స్ ను తీసుకొస్తుంది. తక్కువ దొరికే బెస్ట్ బైక్స్ ను తీసుకొస్తూ మిడ్ రేంజ్ కస్టమర్స్ ను ఎక్కువగా ఆకర్షిస్తుంది ఈ సంస్థ. ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు రూ. లక్షలోపే ఉండే ఎన్నో బైక్స్ ను ఇప్పటికే హోండా తీసుకొచ్చింది. ఈ సెగ్మెంట్ లోనే తాజాగా యాక్టివా కొత్త వెర్షన్ లాంఛ్ చేసింది.
హోండా కొత్త ఎస్‌పీ 125 2025ను (Honda SP125) దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధరను రూ.91,771గా (ఎక్స్‌షోరూమ్, దిల్లీ) నిర్ణయించింది. ఇది డ్రమ్ వేరియంట్ ధర. అయితే ఇందులోనే డిస్క్ వేరియంట్ ధరను రూ.1 లక్షగా నిర్ణయించింది. OBD 2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కొత్త తరం ఎస్‌పీ 125 బైక్ ను తీసుకొచ్చింది. కొత్తగా కొన్ని కనెక్టింగ్ ఫీచర్లను సైతం ఈ బైక్‌కు హోండా జోడించింది.
హోండా కొత్త ఎస్‌పీ 125 బైక్ లో సరికొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌తో ఈ బైక్ వస్తోంది. బైక్‌కు ఫ్రెష్ లుక్ ఇచ్చేందుకు బాడీ గ్రాఫిక్స్‌ను మార్చారు. మొత్తం ఐదు రంగుల్లో ఈ మోటార్ సైకిల్ లభిస్తుంది. అందులో మోస్ట్ ఎట్రాక్టివ్ కలర్స్ లో అందుబాటులో ఉంది. పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెరల్ సిరెన్ బ్లూ, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ రంగుల్లో లభ్యమవుతుందని హోండా తెలిపింది. ఇందులో 124 ఈసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 10.7 BHP పవర్‌ను, 10.9 NM టార్క్‌ను విడుదల చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది.
అయితే ఈ బైక్ లో చెప్పదగిన కొత్త ఫీచర్స్ మరికొన్ని ఉన్నాయి. కొత్తగా బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యంతో 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే ఒకటి. ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌తో పనిచేస్తుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయంతో వస్తోది. అదనంగా వాయిస్ అసిస్టెంట్ సదుపాయం కూడా ఉంది.
మొబైల్ ఛార్జింగ్ కోసం USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. మెరుగైన మైలేజీ కోసం ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ కూడా ఇందులో ఇచ్చారు. ఇక హోండా పాత మోడల్‌తో పోలిస్తే డ్రమ్ వేరియంట్ ధర రూ.4వేలు పెరిగింది. అలాగే డిస్క్ వేరియంట్ ధర రూ.9వేలు అదనం పెరిగింది. OBD 2B ప్రమాణాలు పాటించడం, కొత్తగా కనెక్టింగ్ ఫీచర్లు జోడించడంతో ఈ బైక్ ధర పెరిగినట్లు తెలుస్తుంది. అయితే బడ్జెట్ ధరలోనే మంచి పనితీరు కనబరిచే బైకులకు ఉండే ఆదరణతోనే హోండా ఈ బైక్ ను లాంఛ్ చేసినట్లు తెలుస్తుంది.
ALSO READ : డివైజ్ ట్రాకర్స్ లో ఏది బెస్ట్.. జియోనా? యాపిల్ ఆ?