BigTV English
Advertisement

OTT Movie : లంచ్ బాక్స్ లో లవ్ లెటర్ … ఆ పని చేయని మొగుడిని వదిలి ప్రియుడుతో…

OTT Movie : లంచ్ బాక్స్ లో లవ్ లెటర్ … ఆ పని చేయని మొగుడిని వదిలి ప్రియుడుతో…

OTT Movie : ఈ రోజుల్లో డిజిటల్ మీడియా ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఎంటర్టైన్మెంట్ కోసమే ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాలను పావురాల ద్వారా, ఆ తర్వాత పోస్టుల ద్వారా, ఇప్పుడు మెయిల్స్ ద్వారా పంపుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో టిఫిన్ బాక్స్ లో లెటర్లను పెట్టి ప్రేమించుకుంటారు. ముంబైలో డబ్బా వాలా చాలా ఫేమస్ అయింది. ఇంటి నుంచి లంచ్ బాక్స్ ను తీసుకు వెళ్లే వీళ్ళు అనుకున్న సమయానికి చేరవేస్తూ ఉంటారు. వాటిలోనే మన కథలో హీరో, హీరోయిన్ లెటర్స్ రాస్తూ ప్రేమలో పడతారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘ది లంచ్‌బాక్స్’ (The Lunch Box). ఈ మూవీకి రితేష్ బాత్రా దర్శకత్వం వహించారు. దీనిని గునీత్ మోంగా, అనురాగ్ కశ్యప్, అరుణ్ రంగాచారి నిర్మించారు. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, నిమ్రత్ కౌర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, భారతీ అచ్రేకర్, నకుల్ వైద్ నటించారు. ‘ది లంచ్‌బాక్స్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ తన భర్తతో కలిసి హౌస్ వైఫ్ గా జీవిస్తూ ఉంటుంది. అయితే భర్త మాత్రం తనని ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటాడు. ఒకసారి తన భర్తకి నచ్చిన వంటని చేసి, ఆ లంచ్ బాక్స్ ని అక్కడున్న డబ్బా వాలా తో పంపిస్తుంది. ఆ లంచ్ బాక్స్ పొరపాటున వేరొకరికి వెళ్ళిపోతుంది. అకౌంట్టెంట్ గా పనిచేసే సాజన్ అనే వ్యక్తికి ఈ లంచ్ బాక్స్ వెళుతుంది. తనకోసం వచ్చిన క్యారేజ్ అనుకొని సాజన్ దానిని తింటాడు. అయితే అది తన కోసం రాలేదని తెలుసుకొని, అందులో థాంక్స్ అని ఒక లెటర్ పెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ తన భర్త ఈ లంచ్ బాక్స్ తినలేదని తెలుసుకుంటుంది. లంచ్ బాక్స్ తిన్నావా అని అడిగినా కూడా, సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతాడు హీరోయిన్ భర్త.

ఆ తర్వాత మళ్లీ లంచ్ బాక్స్ ని సాజన్ కి పంపిస్తుంది. అతడు అందులో ఉన్న వాటిని తింటూ, ఒకరికి ఒకరు తమ బాధలు చెప్పుకుంటూ లెటర్లు రాసుకుంటూ ఉంటారు. ఒకరోజు హీరోయిన్ ని సాజన్ కాఫీ షాప్ కి ఇన్వైట్ చేస్తాడు. దూరంగానే ఆమెను చూసి ఆమె చాలా యంగ్ గా ఉండటంతో, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ అతనికి ఖాళీ బాక్స్ పంపుతుంది. సాజన్ రిటైర్ అవుతూ తన ఊరికి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ కూడా భర్తతో విసిగిపోయి, కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది. చివరికి సాజన్, హీరోయిన్ కోసం వస్తాడా? హీరోయిన్ తనని కలవడానికి ట్రై చేస్తుందా? వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×