Coconut Oil For Hair: ప్రతి అమ్మాయికి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలని కోరుకుంటుంది. కానీ బయట కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ముఖ్యంగా స్ట్రెస్, శరీరానికి సరిపడ వాటర్ తాగకపోవడం.. ఇతర కారణాల వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటుంది. ఇందుకోసం అమ్మాయిలు మార్కెట్లో దొరికే రకరకాల షాంపులు, హెయిర్ సీరమ్‌లు, హెయిర్ ఆయిల్స్ మొదలైనవి జుట్టుకు అప్లై చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి .. జుట్టుకు హాని కలిగే ప్రమాదం ఉంది. దీంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్తితుల్లో పైసా ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే పదార్ధాలతో హెయిర్‌కి అప్లై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం కొబ్బరి నూనె, వేపాకు చక్కగా పనిచేస్తుంది. అవును ఈ రెండు జుట్టు పెరుగుదలకు, చుండ్రును తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు వేపాకు తలలోని దురదను, ఇన్పెక్షన్ల నుండి రక్షిస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
☀ కావాల్సిన పదార్ధాలు
⦿ వేపాకు
⦿ మందారం ఆకులు
⦿ కొబ్బరి నూనె
⦿ కరివేపాకు
⦿ మందారం ఆకులు
☀ తయారు చేసుకునే విధానం
ముందుగా వేపాకులను కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కొబ్బరి నూనె, వేపాకులు, మందారం ఆకులు, పువ్వులు, కరివేపాకు వేసి ముదురు రంగులోకి మరేంత వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిని వేరే సీసాలోకి వడకట్టుకోండి.
☀ జుట్టుకు నూనె ఎలా రాయాలి?
తయారు చేసుకున్న నూనెను మీ జుట్టుకు అప్లై చేసి, 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. కనీసం 2 గంటలపాటు ఉంచి తలస్నానం చేయొచ్చు.. లేదా రాత్రి పడుకునే ముందు జుట్టుకు అప్లై చేసి మరుసటి రోజు సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారినికి రెండు, మూడు సార్లు చేస్తే.. ఒత్తైన కురులు మీ సొంతం అవుతాయి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.
☀ కొబ్బరి నూనె వేపాకు ప్రయోజనాలు
కొబ్బరి నూనె, వేపాకును కలిపి తలకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. ఈ రెండిటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి తలపై ఉన్న మురికిని, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
☀ జుట్టు రాలడం తగ్గిస్తుంది
కొబ్బరి నూనె, వేపాకును కలిపి రాయడం వల్ల జుట్టుకు తేమను, పోషణనను అందిస్తాయి. అంతేకాదు జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. కాబట్టి దీనని రెగ్యులర్‌గా వాడటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
Also Read: అమ్మాయిలు ఇది మీ కోసమే.. సమ్మర్ లో మీ ముఖ సౌందర్యాన్ని ఇలా కాపాడుకోండి
☀ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
కొబ్బరి నూనెలో వేపాకు కలిపి రాయడం వల్ల జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. దీనివల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.