Summer Skincare Tips: వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యంతో పాటు.. చర్మాన్ని ఈ ఎండల నుండి కాపాడుకోవడం చాలా అవసరం. వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ముఖంపై ట్యాన్ ఏర్పడటం, మొటిమలు, మచ్చలు ఏర్పడటం వంటివి ఎక్కువగా వస్తుంటాయి. సున్నితమైన చర్మం కలిగి ఉన్నవారికి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ముఖం ఎర్రగా కమిలిపోవడం, దద్దుర్లు రావడం, ఫేస్ జిడ్డుగా ఏర్పడటం వంటివి వస్తుంటాయి. ఇక వీటిని తొలగించేందుకు, ముఖ సౌందర్యం కోసం మగువలు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయి కానీ.. వీటిలో చాలా రకాల కెమికల్స్ ఉండటం వల్ల.. చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే నాచురల్‌గా ఫేస్‌ప్యాక్‌లు తయారు చేసుకున్నారంటే.. మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో మీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసి పోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు, అలోవెరా జెల్‌తో ఫేస్ ప్యాక్
ముందుగా ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకుని అందులో చిటికెడు పసుపు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ఫేస్‌ని శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే ముఖంపై ట్యాన్ తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.
గోధుమ పిండి, గ్రీన్ టీ, విటమిన్ ఇ క్యాప్సూల్స్‌తో ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని అందులో టీ స్పూన్ గోధుమపిండి, గ్రీన్ టీ టీస్పూన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్, రెండు టేబుల్ స్పూన్ వామ్ము వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు.. ఫేస్‌పై మొటిమలు, మురికి, మచ్చలు తొలగిపోయి చాలా అందంగా కనిపిస్తారు.
అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్, అలోవెరా జెల్ టీ స్పూన్, రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. వేసవిలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం చాలా అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది. ముఖంపై ట్యాన్ కూడా తొలగిపోతుంది.
శెనగపిండి, పసుపు, నిమ్మరసం ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్
టీ స్పూన్ శెనగపిండి, టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మురికి, మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది. మీ అందం చూసి మీరే మురిసిపోతారు.
Also Read: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే.. తప్పక పాటించాల్సిన టిప్స్!
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.