BigTV English

Coconut Water: కొబ్బరి నీళ్లు తాగితే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !

Coconut Water: కొబ్బరి నీళ్లు తాగితే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !

Coconut Water: చాలా మందికి కొబ్బరి నీళ్లు అంటే ఇష్టం ఉంటుంది. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తాయి. ఇది సహజ , రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇందులో పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.


కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.కొబ్బరి నీళ్లు ఈ రోజుల్లో ట్రెండీ డ్రింక్‌గా కూడా మారాయి. మీరు కూడా కొబ్బరి నీళ్ళు తాగడానికి ఇష్టపడితే, వీటి వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను తెలుసుకోండి.

ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి:
కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరానికి హాని కలిగించకుండా నిరోధిస్తాయి. అంతే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.


ఎలక్ట్రోలైట్ల పవర్‌హౌస్:
కొబ్బరి నీళ్లలో పెద్ద మొత్తంలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఎనర్జీ డ్రింక్ కంటే ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. కాబట్టి ఇది ఎనర్జీ డ్రింక్‌గా కూడా ఆరోగ్యకరమైన ఎంపిక.

తక్కువ కేలరీలు:
సోడా, జ్యూస్‌లు , సాధారణంగా కేలరీలు ఎక్కువగా ఉండే ఇతర డ్రింక్స్ కంటే ఇది హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఆరోగ్యకరమైనది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. అంతే కాకుండా జీర్ణక్రియ సులభతరం అవుతుంది .

పోషకాలు:
కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. కాల్షియం ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం ఎముకలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం:
కొబ్బరి నీళ్లు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటును నివారిస్తాయి. అంతే కాకుండా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది:
కొబ్బరి నీళ్లు అధిక నీటి శాతాన్ని కలిగి ఉండటం వలన ఇది ఒక అద్భుతమైన హైడ్రేటింగ్ డ్రింక్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా వేసవిలో లేదా వ్యాయామం తర్వాత శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను సరఫరా చేస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ట్రాన్స్ ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఉండవు. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సరైన డ్రింక్. సహజ శక్తిని పెంచే సాధనంగా కూడా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది ఆకలిని తగ్గిస్తుంది. క్రమరహిత ఆహారపు అలవాట్లను నివారించడంలో ఉపయోగపడుతుంది.

రక్తపోటును నియంత్రించడం:
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. జన్మలో జుట్టు రాలదు !

మూత్రపిండాలకు మేలు:
కొబ్బరి నీళ్లలో ఉండే లక్షణాలు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి . ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి , మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

చర్మానికి మేలు:
కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా , ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×