Telangana RTC: ఉగాది ముందే ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రవాణా-బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డిఏను ప్రకటించారు. డీఎ ప్రకటనతో ప్రతి నెల 3.6 కోట్లు అదనపు భారం ఆర్టీసీపై పడనుంది. శనివారం మహిళా దినోత్సవంగా అమలులోకి రానుంది.
ఒకవిధంగా చెప్పాలంటే మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి చెప్పారు. 14 నెలల ప్రజా ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ బస్సుల్లో 150 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. దీనివల్ల ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.
రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు 14 లక్షల మంది మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్రబారం పడింది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేశారు. ఇవన్నీ ఆలోచించి ఆర్టీసీ కార్మికులకు 2.5 శాతం డీఏను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
మరోవైపు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో శనివారం ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభించ నున్నారు. మహిళా సమైక్య సంఘాల ద్వారా తొలి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. రెండో దశలో 450 బస్సులు ఇవ్వనున్నారు. మొత్తంగా చూస్తే 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకోనుంది.
ALSO READ: ఎమ్మెల్యే కోటా.. ఎమ్మెల్సీ సీట్లు నాలుగు వీళ్లకు.. ఒకటి
ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నా రు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త స్కీమ్‌ని ప్రవేశపెడుతోంది. సీఎం చేతుల మీదుగా మహిళలకు ఆయా బస్సులను ఇవ్వనున్నారు. ప్రభుత్వంపై ఎంత భారం పడినా ఆర్టీసీ ఉద్యోగులకు, మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రభుత్వం మరోసారి గుర్తు చేసింది.