E-Paper
Advertisement

Summer Skin Care: సమ్మర్‌లో తప్పకుండా పాటించాల్సిన స్కిన్ కేర్

Summer Skin Care: సమ్మర్‌లో తప్పకుండా పాటించాల్సిన స్కిన్ కేర్
Advertisement

Summer Skin Care: వాతావరణం మారుతున్న కొద్దీ, వేడి తన ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి నెల ప్రారంభం నుండి జనం వేడిమితో ఇబ్బంది పడుతున్నారు. సూర్యుని మండే కిరణాల కారణంగా, దాని భిన్నమైన ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మాన్ని ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

వేసవిలో స్కిన్ కేర్ కోసం చాలా మంది వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. మరికొంత మంది కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు.

Advertisement

బలమైన సూర్యకాంతి మీ చర్మాన్ని ప్రభావితం చేయకూడదని మీరు కోరుకుంటే దాని కోసం మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. చర్మాన్ని ఎండ నుండి రక్షించుకోవడానికి తప్పకుండా పాటించాల్సిన చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాలను పాటించిన తర్వాత మీకు చర్మ సంబంధిత సమస్యలు అస్సలు ఉండవు.

1. సన్‌స్క్రీన్ ముఖ్యం:

Advertisement

ఈ సీజన్‌లో చాలా మంది సన్‌స్క్రీన్ వాడరు. కానీ ఈ సీజన్‌లో సన్ స్క్రీన్ వాడటం చాలా ముఖ్యం. ఈ రోజులో క్రమం తప్పకుండా సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. సన్‌స్క్రీన్‌ 50 SPF ఉంటే, దాని ఫలితాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి.

2. మంచి నాణ్యత గల క్లెన్సర్ :

రోజుకు రెండుసార్లు మంచి నాణ్యత గల క్లెన్సర్‌ని ఉపయోగించి చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం . దీని కోసం, ముందుగా మంచి నాణ్యత గల క్లెన్సర్ కొనండి. ఇక్కడ క్లెన్సర్ అంటే మంచి నాణ్యత గల ఫేస్ వాష్. రాత్రి పడుకునే ముందు మీ చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోండి.

3. సీరం అవసరం:
కొన్నిసార్లు చర్మం చాలా పొడిగా మారుతుంది. అంతే కాకుండా చాలా సార్లు చర్మం చాలా జిడ్డుగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే ఖచ్చితంగా నీ సీరం వాడండి. సీరం మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా కావాల్సిన పోషణను కూడా అందిస్తుంది.

Also Read: పాలలో ఈ ఒక్కటి కలిపి తాగితే.. బోలెడు ప్రయోజనాలు !

4. మాయిశ్చరైజర్ వాడండి:
వేసవి కాలంలో మాయిశ్చరైజర్ వాడటం అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇది సరికాదు ఈ సీజన్‌లో కూడా చర్మానికి మాయిశ్చరైజర్‌లో ఉండే అనేక అంశాలు అవసరం. అందుకే వేసవిలో కూడా తప్పకుండా మాయిశ్చరైజర్ వాడాలని గుర్తుంచుకోండి. మాయిశ్చరైజర్ ప్రతి రోజు వాడటం వల్ల ముఖం జిడ్డుగా మారకుండా ఉంటుంది. అంతే కాకుండా తగిన పోషణ చర్మానికి అంది ముఖం యొక్క రంగు మారకుండా ఉంటుంది.

5. సరైన ఫేస్ స్క్రబ్ ముఖ్యం.

సీజన్, మీ చర్మాన్ని బట్టి వారానికి కనీసం రెండుసార్లు మీ చర్మాన్ని స్క్రబ్ చేయండి. మీరు వాడే స్క్రబ్ మీ చర్మానికి అనుకూలంగా ఉండాలని గుర్తుంచుకోండి. తేనె, చక్కెరతో తయారు చేసిన స్క్రబ్ వాడటం వల్ల మంచి ఫలితం  ఉంటుంది. అంతే కాకుండా టమాటో, చక్కెరతో తయారు చేసిన స్క్రబ్ ముఖానికి వాడినా కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×