E-Paper
Advertisement

Health Tips: ఉడికించిన వేరుశెనగలు రోజూ తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips: ఉడికించిన వేరుశెనగలు రోజూ తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

Health Tips: వేరుశెనగలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉడికించిన వేరుశెనగలను తినడం వల్ల జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వేరుశెనగల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అనేక రకాలుగా పనిచేస్తాయి. వేరుశెనగలను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. వంటల్లో వేరుశెనగలను ఉపయోగించడం వల్ల అద్భుతమైన రుచి ఇస్తుంది. ఇడ్లీ, వడ, దోశలో వేరుశెనగలతో చేసే పచ్చడి అంటే చాలా మంది ఇష్టపడుతారు. అయితే వీటిల్లోనే కాకుండా చాలా రకాల పచ్చళ్లు, వంటకాల్లోను వేరు శెనగలు కీలక పాత్ర పోషిస్తాయి.

ముఖ్యంగా వేరుశెనగలను ఉడకబెట్టి తినడం అంటే చాలా మంది ఇష్టపడుతారు. అందులోను పచ్చి వేరుశెనగలను ఉడకబెట్టి తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వేరుశెనగలను ఉడకబెట్టి తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్, హృద్రోగ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మధుమేహంతో బాధపడే వారికి ఇవి చాలా ఉపశమనం కలిగిస్తాయట. అందువల్ల వేయించుకుని తినే వేరుశెనగల కంటే ఉడకబెట్టుకుని తినే వేరుశెనగల్లో కెలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఊబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Advertisement

ముఖ్యంగా డయాబెటీస్ తో బాధపడే వారికి ఉడికించిన వేరుశెనగలు ప్రయోజనాలు ఇస్తాయి. ఉడికించిన వేరుశెనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇవి సహాయపడతాయి. అందువల్ల ఎటువంటి భయం లేకుండా డయాబెటీస్ పెషెంట్స్ ఉడింకించిన వేరుశెనగలను ఆహారంగా తీసుకోవచ్చు.

జ్ఞాపక శక్తి :

Advertisement

వేరుశెనగలను ఉడకబెట్టి తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఎందుకంటే వేరుశెనగల్లో ఉండే విటమిన్ ఈ కారణంగా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.

ఊబకాయం :

ఉడకబెట్టిన వేరుశెనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తాయి. దీంతో కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉండి బరువు తగ్గించేందుకు చాలా బాగా తోడ్పడుతాయి.

కొలెస్ట్రాల్‌ను నియంత్రణ:

వేరుశెనగల్లో పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడతాయి.

Related News

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

Big Stories

Advertisement
×