BigTV English

Kohli Talks About His 2011 ODI WC: విమానం ఎక్కుతూ.. ఆ రోజు మరిచిపోలేను అన్న విరాట్ కొహ్లీ

Kohli Talks About His 2011 ODI WC: విమానం ఎక్కుతూ.. ఆ రోజు మరిచిపోలేను అన్న విరాట్ కొహ్లీ

Kohli Talks About His 2011 ODI World Cup Winning Memories: విరాట్ కొహ్లీ.. టీమ్ ఇండియా మూలస్తంభం.. ఎట్టకేలకు అమెరికా విమానం ఎక్కాడు.  ఎందుకంటే పేపర్ వర్క్ లో ఏర్పడిన ఇబ్బందుల వల్ల కొహ్లీ ప్రయాణం ఆలస్యమైంది. దీంతో లేట్ గా అమెరికా విమానం ఎక్కాడు.  రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ వీరందరూ మే 25న వెళ్లిపోయారు. నిజానికి వారితోనే కొహ్లీ వెళ్లాల్సి ఉంది. అనుకోకుండా ఆగిపోయాడు.


అక్కడ ఎయిర్ పోర్టులో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. తన పర్సనల్ జీవితంలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో మీడియా ఎంతో గోప్యత పాటించిందని, వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు. అక్కడికక్కడ వారికి బహుమతులు పంచిపెట్టాడు. ఇది తన ఐడియా కాదని, తన భార్య అనుష్కది అని తెలిపాడు. ఆ క్రెడిట్ ని భార్యకి అందించాడు.

ఈ క్రమంలో మొదటి వన్డే ప్రపంచకప్ లో తనకి ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్ లో తొలి వన్డే బంగ్లాదేశ్ తో ఆడానని అన్నాడు. అప్పటికే జట్టులో హేమాహేమీలైన క్రికెటర్లు ఉన్నారని, నేను వారి ముందు చాలా చిన్నవాడిని, కొత్తవాడినని అన్నాడు. కానీ ఇప్పుడు జట్టులో నేనే సీనియర్ ని అని నవ్వుతూ అన్నాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, అందుకు నేనే ఉదాహరణ అని తెలిపాడు. అయితే ఆ రాత్రిని జయించడంలోనే మనిషి సక్సెస్ ఉందని తెలిపాడు. అయితే ఆ క్షణం నేనెంత టెన్షను పడ్డానో.. ఇప్పుడు కూడా అంతే భయం ఉందని తెలిపాడు.


Also Read: గంగూలి పోస్టుతో.. నెట్టింట మంటలు

ఆరోజు జట్టులో స్థానం కోసం, నిలబెట్టుకోగలనా? అని ఆందోళన చెందాను. ఇప్పుడు వచ్చిన పేరు చెడగొట్టుకోకుండా ఎంత జాగ్రత్తగా ఆడాలని ఆలోచిస్తున్నాని తెలిపాడు. నిజానికి ఆరోజు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కొహ్లీ 83 బంతుల్లో సెంచరీ చేశాడు. అప్పుడే తనకి ఆత్మవిశ్వాసం కలిగిందని, తనూ ఆడగలననే నమ్మకం.. ఆ చిన్నవయసులో కలిగిందని చెప్పుకొచ్చాడు.

సిరీసుల్లో ఆడటం వేరు, మెగా టోర్నమెంటుల్లో ఆడటం వేరు అని అన్నాడు. ఇప్పుడు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాను. క్రీజులో.. నా ప్రణాళికలు అమలు చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపాడు. మంచి జట్టుతో వెళుతున్నామని, అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×