Neem leaves Uses: వేపాకు.. దీని పేరు వినగానే అందరు చేదుగా ఉంటుందని ముఖం చిట్లేస్తారు. అయితే ఆయుర్వేదంలో వేప చెట్లను సర్వ రోగ నివారిణిగా ఉపయోగిస్తారు. అంటే అన్ని రకాల రోగాలను ఇది నయం చేస్తుందని చాలా మంది నమ్మకం. భారతదేశంలో ఈ చెట్టును ఎంతో పవిత్రంగా చూస్తారు. ఈ ఆకు చేదుగా ఉంటుంది. కానీ దీనిలో ఉండే ఔషధ గుణాలు మాటల్లో చేప్పలేనంతగా ఉంటాయి.
వేపాకులలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటీఇన్ఫ్లమేటరీ వంటి లక్షాణాలు ఉంటాయి. ఇది అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
షుగర్స్ లెవల్స్ కంట్రోల్:
వేపాకును పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేపాకు జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి, ఐండెజేశన్, అల్సర్, అజీర్ణం లాంటి సమస్యలనూ నియంత్రిస్తుంది. అంతేకాకుండా వేపాకు రక్తాన్ని శుభ్రపరచి శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. వేపాకు నుంచి లభించే యాంటీ‑ఇన్ఫ్లమేటరీ గుణాలు పేగు అల్సర్స్, గ్యాస్ట్రెలీటిస్‌ల పరిష్కారంలో సహకారిగా ఉపయోగపడుతాయి.
చర్మ సమస్యలకు చెక్:
ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను తగ్గించడానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలా చేయకుండా వేపాకును నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే మొటిమల సమస్యలు తగ్గడమే కాకుండా..ఫేస్ కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా చాలా మందికి ముఖంపై మచ్చల సమస్య కూడా ఉంటుంది. అయితే దీని నివారణలకు కొన్ని వేపాకులను తీసుకుని పేస్ట్‌లా చేసి అందులో 2 స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆపై కాసేపు ఆగి ముఖం కడుక్కుంటే మీరు మచ్చలు లేని ముఖాన్ని చూడవచ్చు.
జుట్టు ఆరోగ్యం:
వేపాకు నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తలకు రాసుకోవడం వల్ల తలలో పేరిన ఫంగస్ చుండ్రుని తొలగించడానికి సహాయపడుతుంది. వేప నూనె జుట్టు రంధ్రాలను బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పోషకాలు జుట్టు మూలాలకు పోషణ ఇవ్వడం ద్వారా తలలో రక్త ప్రసరణ పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఈ వేప నూనెని రోజే ఆప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా మారుతుంది.
దంత ఆరోగ్యం:
వేపాకుని ఉపయోగించడం వల్ల దంత క్షయం, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. ఇంకా పల్లెటూరి వారు అయితే వేప పుల్లని తీసుకుని బ్రష్ చేస్తారు. ఇది 3 ఇన్ 1 బ్రష్‌గా యూస్ అవుతుంది. వేప పుల్లతో బ్రష్ చేయడం వల్ల దంతాలు స్ట్రాంగ్ అవుతాయి, నోటి దుర్వాసన మాయం అవుతుంది, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యం:
ఈ వేపాకులను రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కాలేయ కణజాలానికి నష్టం జరగకుండా కాపాడుతుంది. సీజనల్ వ్యాధులను తగ్గిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ ఆకును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వ్యాధులను నివారిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి డయాబెటిస్ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: దీన్ని నోట్లో వేస్తే చాలు.. తాగిందంతా నిమిషాల్లో మటాష్..
వేపాకులను ఎలా ఉపయోగించాలి:
వేపాకులను నేరుగా నమిలి తినవచ్చు లేదా పొడిగా చేసి నీటిలో కలిపి తీసుకోవచ్చు.
వేపాకులను నీటిలో మరిగించి, ఆ నీటిని స్నానం చేయడం ద్వారా చర్మ సమస్యలు తగ్గుతాయి.
అలాగే వేపాకుని పేస్ట్ లాగా చేసుకుని చర్మం పై అప్లై చేయవచ్చు.