Shivathmika: ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ ఛాన్సులు రావాలి అంటే మంచి నటన నైపుణ్యంతో పాటు కాస్త అందంగా ఉంటే చాలు సినిమా అవకాశాలు వచ్చేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం సినిమా అవకాశం రావాలి అంటే సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ, క్రేజ్ ఉండాలని తెలుస్తోంది. సోషల్ మీడియాలో క్రేజ్ లేకపోతే సినిమా అవకాశాలు కూడా రావని తాజాగా సినీ నటుడు రాజశేఖర్(Rajasekhar) కుమార్తె శివాత్మిక రాజశేఖర్ (Shivatmika Rajasekhar) తెలియజేశారు. ఈమెకు ఎంతో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టారు. అయితే ఈమెకు కూడా ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్ప లేదని తెలుస్తోంది. అందరిలాగే శివాత్మిక కూడా సినిమాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సినిమా అవకాశాలు రాలేదని స్పష్టం అవుతుంది.
ఛాన్సులు రావాలంటే ఫాలోవర్స్ ఉండాల్సిందే…
పలు సందర్భాలలో ఈమె ఆడిషన్ కి వెళ్ళినప్పుడు తనని రిజెక్ట్ చేశారని అలా రిజెక్ట్ చేయడానికి ఎన్నో కారణాలను చెప్పినట్టు తెలిపారు. ఇక ఒక సినిమా కోసం అయితే ఏకంగా తనకు ఇంస్టాగ్రామ్ లో పెద్దగా ఫాలోవర్స్ లేరు అని ఒక చిన్న కారణంతోనే సినిమా నుంచి తీసేశారు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శివాత్మిక చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇలా తనకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ (Instagram Fallowers)లేరన్న కారణంతో నన్ను తొలగించి మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నటువంటి మరొక హీరోయిన్ ను తీసుకున్నారని తెలిపారు.
సినీ నేపథ్యం ఉన్న దక్కని సక్సెస్..
ఇలా తన తల్లిదండ్రులు ఇద్దరు హీరో హీరోయిన్స్ అయినప్పటికీ శివాత్మికకు మాత్రం సినిమా అవకాశాలు రాకపోవడమే కాకుండా వచ్చిన సినిమాల నుంచి కూడా ఇలా చిన్న కారణాలతో తనని తప్పించారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక రాజశేఖర్ జీవిత కుమార్తెగా శివాత్మిక దొరసాని (Dorasani)అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతో తన నటన ద్వారా పరవాలేదు అనిపించుకున్న ఈమె అనంతరం తమిళంలో ఓరెండు సినిమాలు చేశారు. అక్కడ కూడా పెద్దగా ఆదరణ లభించలేదు.
ఇలా తమిళంలో కూడా సక్సెస్ రాకపోవడంతో తిరిగి తెలుగులో పంచతంత్రం, రంగ మార్తాండ వంటి సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. రంగమార్తాండ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో దర్శక నిర్మాతల ధోరణి కూడా అలాగే ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే వారిని సినిమాలలోకి తీసుకోవటం వల్ల సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని, సినిమాకు మంచి ప్రమోషన్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటి పలు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ కూడా ఇటీవల కాలంలో సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
Also Read: బెగ్గర్ పాత్రలో అదరగొట్టిన అల్లరి నరేష్… ధనుష్ కూడా చెయ్యలేకపోయాడుగా?