BigTV English

Cool Drinks: ఈ కూల్ డ్రింక్స్‌తో యమ డేంజర్ గురూ..!

Cool Drinks : కూల్ డ్రింక్స్‌ను ఇష్టపడని వారు. షాపుల్లో చూడగానే తాగాలనిపించే పానీయం ఇది. పార్టీ ఏదైనా, సినిమాకి వెళ్లినా కూల్ డ్రింక్‌తోనే స్టార్ట్ చేస్తాము. నేటి కాలంలో కూల్ డ్రింక్స్ ట్రెండ్ పెరిగిపోయింది. తాగుతుంటే చల్లగా హాయిగా కడుపులోకి పోతూనే ఉంటుంది.

Cool Drinks: ఈ కూల్ డ్రింక్స్‌తో యమ డేంజర్ గురూ..!

Cool Drinks : కూల్ డ్రింక్స్‌ను ఇష్టపడని వారుండరు. షాపుల్లో చూడగానే తాగాలనిపించే పానీయం ఇది. పార్టీ ఏదైనా, సినిమాకి వెళ్లినా కూల్ డ్రింక్‌తోనే స్టార్ట్ చేస్తాము. నేటి కాలంలో కూల్ డ్రింక్స్ ట్రెండ్ పెరిగిపోయింది. తాగుతుంటే చల్లగా హాయిగా కడుపులోకి పోతూనే ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఇప్పటికే చాలా మంది గ్రహించారు. కానీ రెగ్యులర్‌గా కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉన్నారు. ఈ డ్రింక్స్ తరచూ తాగే వారిలో షుగర్, బెల్లీ ఫ్యాట్, దంతాల సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. జ్ఞాపకశక్తి కూడా కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా కూల్‌డ్రింక్స్‌ తాగడం వలన కలిగే నష్టాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Cool Drinks

ఫ్రామింగమచ్‌ హార్ట్‌ స్టడీ ప్రకారం.. వారానికి మూడుసార్లు కూల్ డ్రింక్స్ తాగే వారిలో మెదడు పరిమాణం తగ్గుతున్నట్లు గుర్తించారు. మెమోరీ కూడా లాస్‌ అవుతుందట. ఈ విషయాన్ని బోస్టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ రీసెర్చ్‌ ధ్రువీకరించింది.


దంపతుల్లో రోజూ కూల్‌డ్రింక్‌ తాగేవారు ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయని స్పష్టం చేశారు. జంటలో ఒకరు తాగినా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లిడించారు.

వయసుపై బడిన వారు రోజూ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల హార్ట్‌స్ట్రోక్, అల్జిమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చిన్న పిల్లలు రెగ్యులర్‌గా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడులో ఎదుగుదల లోపిస్తుంది. కాబట్టి చిన్నపిల్లను కూల్ డ్రింక్స్‌కూ దూరంగా ఉంచాలి. అజాగ్రత్తగా వ్యవహరిస్తే బుద్ధి మందగిస్తుందిని హెచ్చరిస్తున్నారు.

కూల్ డ్రింక్స్ రెగ్యులర్‌గా తాగే వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. వీటి కారణంగా శరీరంలోని చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

కూల్ డ్రింక్స్‌లో ఫ్రక్టోజ్‌, సుక్రోజ్, గ్లూకోజ్‌లు శరీరంలోని కెలరీలను పెంచుతాయి. అందువల్ల కూల్ డ్రింక్స్ తాగితే వేగంగా బరువు పెరుగుతారు. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఊబకాయం వచ్చే ప్రమాదం 60 శాతం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

కూల్ డ్రింక్స్‌లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లను జీర్ణం చేయడానికి కాలేయం చాలా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇది కాలేయవాపుకు దారి తీస్తుంది.

కూల్ డ్రింక్స్, సోడాలలో చక్కెర వంటి సేంద్రీయ, ఫాస్పోరిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి. ఇవి దంతంపై ఉండే ఎనామిల్‌‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా దంతాలు పుచ్చిపోయే ప్రమాదం ఉంది.

కూల్ డ్రింక్స్‌లో కెఫిన్ అనే మత్తు పదార్థం ఉంటుంది. దీనివల్ల శరీరంలో డోపమైన స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్ కూల్ డ్రింక్స్‌కు అడిక్ట్ చేస్తుంది. రోజూ తాగేలా ప్రేరేపిస్తుంది. చిన్న పిల్లలు అయితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోవచ్చు.

Tags

Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×