BigTV English

Covid-19 : కోవిడ్ 19 నుండి కాపాడే ప్రొటీన్ గుర్తింపు..

Covid-19 : కోవిడ్ 19 నుండి కాపాడే ప్రొటీన్ గుర్తింపు..

Covid-19 : కోవిడ్ 19 అనే మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని ఒక్కసారిగా కుదిపేసింది. దాని మీద పరిశోధనలు చేసి అసలు ఆ వ్యాధి ఎందుకు వచ్చింది, దాన్ని అరకట్టడం ఎలా అని శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి పరిశోధనలు చేసేలోపే ఎంతోమంది ప్రాణాలను ఇది బలిదీసుకుంది. మెల్లగా దానికి వైరస్‌ను కనుగొని ప్రజలకు అందించిన తర్వాత శాస్త్రవేత్తలు దానిపై క్షుణ్ణంగా పరిశోధనలు మొదలుపెట్టారు.


తాజాగా ఆస్ట్రేలియాలో కోవిడ్ 19పై పరీక్షలు జరిగాయి. దీన్ని అరికట్టడానికి ఏదైనా పరిష్కారం ఉందా అని గత కొన్ని నెలలుగా అక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొందరు కోవిడ్ 19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైతే.. మరికొందరిలో మాత్రం అసలు లక్షణాలే కనిపించవు. అసలు అలా ఎందుకు జరుగుతుంది అనేదానిపై వారి పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే దీనికి కోవిడ్ 19 సోకినప్పుడు మనిషి ఊపరితిత్తులకు అంటుకొని ఉండే ఒక ప్రొటీనే కారణమని నిర్ధారించారు.

ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల వల్ల లంగ్ ఫైబ్రోసిస్‌ను అదుపు చేయడం వల్ల కోవిడ్ 19ను దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఊపరితిత్తులలో వారు కనుగొన్న ప్రొటీన్‌పై వారు క్షుణ్ణంగా పరీక్షలు చేపట్టారు. శాస్త్రవేత్తలు మరిన్ని పరీక్షలు చేసి ఇలాంటి ప్రొటీన్ ఊపిరితిత్తుల్లోనే కాకుండా శరీరంలో ఇంకెక్కడైనా ఉందా అని కనుక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రొటీన్‌ను ఎదుర్కోవడానికి శరీరంలో ఎల్ఆర్ఆర్‌‌సీ 15 అనే ప్రొటీన్ ఉందని వారు తెలుసుకున్నారు.


కోవిడ్ 19 వల్ల చనిపోయిన వారి శరీరంలో కూడా ఎల్ఆర్ఆర్‌‌సీ 15 ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వారిని కోవిడ్ బారి నుండి కాపాడే అవకాశం ఉన్నా.. ఆ సమయానికి వారికి ఈ ప్రొటీన్ విడుదల అవ్వకపోవడమో.. లేదా సరైన మోతాదులో విడుదల అవ్వకపోవడమే వారి మరణానికి కారణం అయ్యిండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే కోవిడ్ 19 స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఎల్ఆర్ఆర్‌‌సీ 15 ఎక్కువగా విడుదలవుతుందని.. కోవిడ్ తీవ్రంగా శరీరంలో వ్యాప్తి చెందిన తర్వాత ఈ ప్రొటీన్ ఎక్కువగా విడుదల అవ్వడం లేదని వారు గుర్తించారు.

ఎల్ఆర్ఆర్‌‌సీ 15పై చేసిన పరిశోధనలు కోవిడ్ 19 పేషెంట్లకు ఎలాంటి చికిత్స అందించాలి, ఎలాంటి మందులు ఇవ్వాలి అనేదానిపై మరింత క్లారిటీ తీసుకురానుంది. లంగ్ ఫైబ్రోసిస్‌ను కంట్రోల్ ఉంచడం దీనికి ముఖ్యమని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఇది చేయడానికి ప్రత్యేకమైన చికిత్స కానీ, ప్రక్రియ కానీ లేదని వారు బయటపెట్టారు. అందుకే లంగ్ ఫైబ్రోసిస్‌పై ప్రస్తుతం పరిశోధనలు చేయడానికి సిద్ధమవుతున్నారు శాస్త్రవేత్తలు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×