BigTV English

Ram Charan : ఆస్కార్ కే కొత్త దారి చూపించిన గ్లోబల్ స్టార్… చరణ్ అంటే మినిమం ఉంటది మరి

Ram Charan : ఆస్కార్ కే కొత్త దారి చూపించిన గ్లోబల్ స్టార్… చరణ్ అంటే మినిమం ఉంటది మరి

Ram Charan : ప్రపంచవ్యాప్తంగా సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఏదైనా ఉందంటే అది ఆస్కార్ మాత్రమే అని చెప్పొచ్చు. అవార్డు దక్కించుకోవడానికి హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ అందరు పోటీ పడుతూ సినిమాలు తీస్తూ ఉంటారు. అసలు ఆస్కార్ రేసులో సినిమా నిలిచిందంటేనే.. ఎంతో గొప్పగా భావిస్తారు. అలాంటి ఆస్కార్ అవార్డులలో ఇప్పుడు కొత్త కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇకపై స్టంట్ డిజైన్ కేటగిరీలో అవార్డులు ఇవ్వనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. సినిమా ప్రారంభం నుంచి ఆ నిర్మాణంలో స్టంట్ డిజైన్ అనేది ఒక భాగంగా మారిపోయింది. అలాంటి కళాకారులకు, ఇలా అవార్డు ఇచ్చి గౌరవించుకోవడం మాకు చాలా గర్వంగా ఉందని ఆస్కార్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 2027 నుంచి విడుదల కానున్న సినిమాలకు ఈ జాబితాను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. అందులో RRR నిలవడం తో పాటు రామ్ చరణ్ క్రియేట్ చేసిన ఆ కేటగిరి వివరాలు చూద్దాం..


RRR మరో రికార్డ్..

ఆస్కార్ ప్రవేశపెట్టిన కొత్త జాబితా పోస్టర్ను ఆస్కార్ ఎక్స్ వేదికగా విడుదల చేసింది. అందులో RRR ఇమేజ్ ని ఉంచింది. హాలీవుడ్ సినిమాలతో సమానంగా ఆర్ఆర్ఆర్ పోస్టర్ చేర్చడం విశేషం. ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ ఎట్ వన్స్, RRR, మిషన్ ఇంపాజిబుల్, సినిమాలలోని స్టంట్ ఇమేజ్ లతో కూడిన పోస్టర్ ను ఆస్కార్ రిలీజ్ చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి సృష్టించిన ప్రభంజనం త్రిబుల్ ఆర్ సినిమా. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే దర్శకుడు రాజమౌళి తెలుగు పాన్ ఇండియా లెవెల్ కి న తీసుకువెళ్లి ఆస్కార్ రేసులో మన తెలుగు చిత్రాన్ని నిలిపారు. బాహుబలితో పాన్ ఇండియా సినిమా తీసిన రాజమౌళి, RRR సినిమాతో ఆస్కార్ అవార్డును అందించారు. ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ వార్త తెలిసిన తెలుగు సినీ ప్రేమికులు ఆనందిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయికి దక్కిన మరో గౌరవం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో విల్లు స్టంట్ క్రియేట్ చేసిన వారికి.. ఆ కేటగిరి లో అవార్డు ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు అని రాయాలి.. ఈ కేటగిరిని ఈ ఆస్కార్ అవార్డుల్లో కొత్త ప్రకటించడం చూసి రామ్ చరణ్ అభిమానులతో పాటు యావత్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు.


స్పందించిన రాజమౌళి..

ఆస్కార్ అవార్డుల్లో కొత్త క్యాటగిరి ప్రకటించడం పై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. వందేళ్ళ నిరీక్షణ ఫలించింది 2027 నుంచి విడుదలయ్యే చిత్రాలకు కొత్తగా స్టంట్ డిజైన్ లో అవార్డులను అందించడం సంతోషకరం. దీన్ని సాధ్యం చేసినందుకు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు అని పోస్ట్ పెట్టారు. మీరు విడుదల చేసిన పోస్టర్ లో RRR విజువల్ చూసి చాలా సంతోషం వేసింది అని రాజమౌళి సంతోషాన్ని తెలియజేశారు.

Also read: Kalyan Ram: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జాతరే.. తమ్ముడు వస్తున్నాడు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×