Thammudu : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. ఈ మధ్యకాలంలో త్వర త్వరగా సినిమాలు చేయటం తగ్గించేసారు. ఒకప్పుడు దిల్ రాజు నిర్మాణంలో చాలా సినిమాలు జరుగుతూ ఉండేవి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే మంచి అంచనాలు ఉండేవి. రీసెంట్ టైమ్స్ లో ఈ బ్యానర్ నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజెర్ లాస్ ను సంక్రాంతికి వస్తున్నాం కొంతవరకు భర్తీ చేసింది. ఇక ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా తమ్ముడు.
నితిన్ కి హిట్ లేదు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో నితిన్ ఒకరు. జయం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సై సినిమా తర్వాత చాలా ఏళ్లు పాటు ఒక్క హిట్ సినిమా కూడా నితిన్ కు పడలేదు. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఇష్క్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అక్కడితో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నితిన్ సినిమాలను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కొన్ని పాటలను నితిన్ సినిమాల్లో కూడా ఉపయోగించేవాడు. ఇక నితిన్ వెంకీ కుడుమున దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే ఒక సినిమాను చేశాడు. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తుంది అనుకునే ఆ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.
ట్రైలర్ వ్యూస్ లో భారీ తేడా
వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ట్రైలర్ కు దాదాపుగా 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే అందులో చాలావరకు పెయిడ్ వ్యూస్ అని కొంతమంది అభిప్రాయం. ఇక ప్రస్తుతం తమ్ముడు ట్రైలర్ కు మూడు మిలియన్ న్యూస్ ఉన్నాయి. అయితే ఈ వ్యూస్ కూడా చాలా జెన్యూన్ గా వచ్చాయి అని తెలుస్తుంది. ట్రైలర్ వ్యూస్ కోసం ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ చేయకుండా ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేసినట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. పెయిడ్ ప్రమోషన్స్ లేకుండా 3 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే, ఇది సినిమాకి ప్లస్ పాయింట్. ఇదివరకు పవన్ కళ్యాణ్ పాటలు మాత్రమే వాడిన నితిన్ మొదటిసారి టైటిల్ కూడా వాడుకున్నారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి మంచి అంచనాలు నెలకొన్నాయి.
Also Read : The Raja Saab: 24గంటల్లో ది రాజా సాబ్ షేక్ చేశాడు