బయట దొరికే కట్లెట్స్ నోరూరించేలా ఉంటాయి. కానీ అవి ఎలాంటి నూనెతో తయారుచేస్తారో తెలియదు. కాబట్టి ఇంట్లోనే టేస్టీగా సేమియా కట్లెట్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంతో రుచిగా ఉంటాయి. సేమియా కట్లెట్స్ చేయడం కూడా చాలా సులువు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
సేమియా కట్లెట్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు
సేమియా – ఒక కప్పు
ఉల్లిపాయలు – రెండు
బఠానీలు – గుప్పెడు
క్యారెట్ – ఒకటి
బంగాళదుంప – ఒకటి
మైదాపిండి – అరకప్పు
జీలకర్ర – అరస్పూను
గరం మసాలా – ఒక స్పూను
పసుపు – చిటికెడు
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
పచ్చిమిర్చి – రెండు
సేమియా కట్లెట్స్ రెసిపీ
⦿ సేమియా కట్లెట్స్ చేసేందుకు ముందుగా సేమియాను ఒక గిన్నెలో వేయాలి.
⦿ అందులో గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి.
⦿ సేమియా మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని వడకట్టి సేమియాను పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు బంగాళదుంపలను, క్యారెట్లు, బఠానీలు కూడా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు ఒక గిన్నెలో క్యారెట్లు, బంగాళదుంపలు, బఠానీలు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేత్తోనే మెదుపుకోవాలి.
⦿ ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి.
⦿ ఇప్పుడు అదే మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న సేమియాను కూడా కలిపి వేసి గరిటతో బాగా కలుపుకోవాలి.
⦿ అలాగే మైదా పిండిని కూడా వేసి బాగా కలపాలి.
⦿ ఈ మొత్తం మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పును, పసుపు, జీలకర్ర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ అవసరమైతే కాస్త నీళ్లు వేసి దీన్ని గట్టిగా మందంగా వచ్చేలా కలుపుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
⦿ ఈ నూనె బాగా వేడెక్కాక సేమియా మిశ్రమాన్ని చిన్న ముద్దను తీసి కట్లెట్స్ లాగా చేత్తోనే ఒత్తుకొని నూనెలో వేసి వేయించాలి.
⦿ వీటిని రెండు వైపులా రంగు మారేవరకు వేయించుకోవాలి.
⦿ వాటిని తీసి టిష్యూ పేపర్ల మీద వేసుకోవాలి టిష్యూ పేపరు అదనపు నూనెను పీల్చేస్తుంది. స్పైసి క్రిస్పీ కట్లెట్లు రెడీ అయినట్టే.
Also Read: వేసవికాలం వచ్చేస్తోంది, మామిడికాయ పులిహోర చేసేందుకు సిద్ధం అవ్వండి, రెసిపీ ఇదిగో
సేమియాతో ఎప్పుడు పాయసమే కాదు, ఇలా కట్లెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి బాగా నచ్చుతుంది. పైగా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. కాబట్టి తినాలన్న కోరిక కూడా పుడుతుంది. దీన్ని సాస్ లో లేదా పుదీనా చట్నీతో తింటే అదిరిపోతుంది. సేమియా తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి కట్లెట్స్ కూడా తక్కువ ధరలొనే అయిపోతాయి. అదే బయటకు ఉంటే మాత్రం కట్లెట్స్ చాలా ఎక్కువ రేటు ఉంటాయి, కాబట్టి ఇంట్లోనే సేమియా కట్టలేదు వండుకోవడానికి ప్రయత్నించండి.