BigTV English

Kangana Ranaut:’ఇప్పుడు తెలుస్తోంది.. నేను ఓ అహంకారిని’… ఫైనల్‌గా తప్పు ఒప్పుకున్న కంగనా..!

Kangana Ranaut:’ఇప్పుడు తెలుస్తోంది.. నేను ఓ అహంకారిని’… ఫైనల్‌గా తప్పు ఒప్పుకున్న కంగనా..!

Kangana Ranaut..బాలీవుడ్ క్వీన్.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన కంగనా రనౌత్ (Kangana Ranaut ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎలాంటి పాత్రలోనైనా జీవించగలిగే కెపాసిటీని కలిగి ఉన్నది. అందుకే నార్త్ ను మొదలుకొని సౌత్ వరకు భారీ పాపులారిటీ అందుకుంది. అంతేకాదు కేంద్రం అందించే అత్యున్నత నాల్గవ భద్రతా బలగాలైన Y+ కేటగిరీని కూడా కేంద్రం ఈమె కోసం కేటాయించింది అంటే ఇక ఈమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా ఒక విషయంపై స్పందించింది అంటే ఒక పట్టాన దానిని వదలదు. అలాగే సమాజంలో జరిగే పలు అంశాలపై స్పందిస్తుంది. అప్పుడప్పుడు తన మాటలతో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. తన చేతలతో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇప్పుడే అర్థమవుతోంది.. నేను అహంకారిణి అంటూ తన తప్పును ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


అహంకార భావం నాలో ఉండేది- కంగనా రనౌత్..

తన డ్రీమ్ ప్రాజెక్ట్ కేఫ్ ని హిమాలయాల్లో స్థాపించాలని ఎప్పటినుంచో కలలు కన్న ఈ ముద్దుగుమ్మ.. ఎట్టకేలకు తన కోరికను నెరవేర్చుకుంది.. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి లో కేఫ్ ప్రారంభించి, వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది . ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కంగనా.. అందులో ఎన్నో విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ అందరిని అబ్బురపరిచింది. కంగనా రనౌత్ మాట్లాడుతూ.. “మా అమ్మ ఎప్పుడూ నాతో ఒక మహిళగా ఇంటి పనులకు ఎక్కువ సమయం కేటాయించాలని చెబుతూ ఉండేది. ముఖ్యంగా నెయ్యి తయారు చేయడం, ఊరగాయ పెట్టడం , కూరగాయలు ఎలా పండించాలో కూడా తెలుసుకొని , నేర్చుకోమని కూడా నాకు చెప్పేది. అయితే అప్పుడు అమ్మ చెప్పే మాటలు నాకు చాలా తెలివి తక్కువగా అనిపించేవి. నేర్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం కూడా ఉండదు అని అనుకున్నాను. అంతేకాదు నేను బాల్యంలోనే దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళల్లో నేను కూడా ఒకదాన్ని అని అనుకునేదాన్ని. అంతటి అహంకార భావం అప్పట్లో నాలో ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ నాలో కూడా మార్పు వచ్చింది. ఆమె మాటలకు అప్పుడు అర్థం ఏంటో అర్థం అయ్యేది కాదు. కానీ నేను కేఫ్ ప్రారంభించిన తర్వాత మా అమ్మ చెప్పిన మాటలు ఇప్పుడిప్పుడే గుర్తుకు వస్తున్నాయి. ఇక మా అమ్మ ఈరోజు ఎంతో సంతోషంగా కూడా ఉంది. నేను పరిణతి చెందానని , తెలివైన దాన్ని అయ్యానని అమ్మ భావిస్తోంది..” అంటూ కంగనా తెలిపింది. ఇక కంగనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే తప్పు ఒప్పుకుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


ప్రేమికుల రోజున కేఫ్ ప్రారంభించిన కంగనా..

ఇకపోతే తన చిన్ననాటి కల అయిన ” ది మౌంటైన్ స్టోరీ ” కేఫ్ ను హిమాలయాల నడిబొడ్డున ప్రారంభించింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ” నా చిన్ననాటి కల “ది మౌంటెన్స్ స్టోరీ” హిమాలయాల నడిబొడ్డున వికసించింది. ఈ కేఫ్ కేవలం భోజనం చేసే ఒక ప్రదేశం మాత్రమే కాదు నా తల్లి వంటగది సువాసనలకు నిలయం కూడా..” అంటూ తన కేఫ్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది కంగనా.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×