Dabidi Dibidi Song: బాలయ్య అంటే పేరు కాదు.. బ్రాండ్ అంటుంటారు ఫ్యాన్స్. అందుకే ఆయన పేరు చెప్తేనే ప్రేక్షకుల్లో ఒక హై వచ్చేస్తుంది. ఆయన సినిమాలు రొటీన్‌గా ఉన్నాయని చెప్తూనే వాటినే చూసేవాళ్లు, ఆయన పాటలను ఎంజాయ్ చేసేవాళ్లు, స్టెప్పులను ట్రోల్ చేస్తూ వాటితోనే రీల్స్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. అలా తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’లో దబిడి దిబిడి పాట కూడా విపరీతంగా ట్రోల్ అయ్యింది. లిరికల్ వీడియో విడుదల అవ్వగానే దీని కొరియోగ్రాఫీని చాలామంది ప్రేక్షకులు ట్రోల్ చేశారు. కానీ ఈ పాటను ఇక్కడ కొడితే.. రీసౌండ్ జపాన్‌లో వచ్చింది. తాజాగా జపాన్ పాపలు ఈ పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
జపాన్ పాపల స్టెప్పులు
తెలుగు పాటలకు, ముఖ్యంగా బాలయ్య పాటలకు ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. చాలామంది ఫారిన్ ఆర్టిస్టులు ఆయన పాటలకు తరచుగా రీల్స్ చేస్తూనే ఉంటారు. తెలుగు ప్రేక్షకులు ఆ పాటను ట్రోల్ చేసినా కూడా వారు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తారు. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది. ‘డాకు మహారాజ్’లోని దబిడి దిబిడి (Dabidi Dibidi) పాట విడుదల అవ్వగానే ట్రోల్ అవ్వడంతో దానిపై చాలామంది రీల్స్ చేయలేదు. కానీ జపాన్‌కు చెందిన ఒక అమ్మాయిల డ్యాన్స్ టీమ్.. ఈ పాటకు వీడియోలు ఉన్నట్టుగా స్టెప్పులేశారు. ఈ వీడియో ఊర్వశి రౌతెలా కంటపడడంతో తను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఊర్వశి హ్యాపీ
జపాన్ డ్యాన్స్ టీమ్ చేసిన ఈ పర్ఫార్మెన్స్‌ను ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అది అలా అలా ఊర్వశి వరకు చేరింది. దీనికి ‘ది ఊర్వశి డ్యాన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దబిడి దిబిడి పాట ఊర్వశికి చాలా నచ్చింది. అందుకే దానిపై ఎంత ట్రోల్స్ వస్తున్నా తను మాత్రం ఆ పాటను, దాని కొరియోగ్రాఫీని వెనకేసుకొస్తుంది. ఆ కొరియోగ్రాఫీలో ఎలాంటి తప్పు లేదని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. అలా మరోసారి ఈ పాటకు జపాన్ డ్యాన్స్ గ్రూప్ స్టెప్పులేయడం చూసి తను మురిసిపోయింది. ఇది అందరూ చూడాలనే ఉద్దేశ్యంతోనే తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్‌తో పంచుకుంది.
Also Read: పవన్ ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ ‘అజ్ఞాతం’ ఇక వీడింది.!
‘డాకు మహారాజ్’ రేంజ్
బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. బాలయ్య మూవీ అంటే ప్రేక్షకులు ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఇందులో చూపించాడు బాబీ. అలా మూవీకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇందులో బాలయ్యకు జోడీగా ‘అఖండ’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఇక ప్రగ్యా జైస్వాల్‌తో పాటు శ్రద్ధా శ్రీనాధ్ కూడా మరొక హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇక తమన్ అందించిన సంగీతం ‘డాకు మహారాజ్’కు ప్రాణం పోసింది. ఇందులోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బాలయ్య పాటకు జపనీయుల డాన్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన
'డాకుమహారాజ్' సినిమాలోని 'దబిడి దిబిడి' సాంగ్
జపాన్ను తాకింది. ఓ డాన్స్ టీమ్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ఈ వీడియోను నటి ఊర్వశీ రౌతేలా ఇన్ స్టాలో షేర్ చేశారు. దబిడి దిబిడి ప్రపంచ వ్యాప్తమైందని… pic.twitter.com/8FLebzIC89— ChotaNews App (@ChotaNewsApp) February 15, 2025