Hair Serum: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య జుట్టురాలిపోవడం. చుండ్రు రావడం. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బయట మార్కెట్లో అనేక రకాల హెయిర్ సీరమ్స్ ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల ఫలితం ఉంటుందో లేదో తెలీదు కానీ జుట్టుకు డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. పూర్వం రోజుల్లో తలకు కొబ్బరి నూనె పెట్టుకునే వాళ్లు.. ప్రస్తుత రోజుల్లో అమ్మయిలు హెయిర్ ఆయిల్ సీరమ్‌లు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ హెయిర్ సీరమ్‌లలో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ సీరమ్‌లు కొనుగోలు చేసే ముందు.. తప్పకుండా ఈ విషయాలు తెలుకోండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సల్ఫేట్లు లేకుండా చూసుకోండి..
మీరు కొన్న హెయిర్ సీరమ్‌లలో సల్ఫేట్‌లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. చుండ్రు సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వాడే హెయిర్ సీరమ్‌లలో సల్ఫేట్ లేకుండా చూసుకోండి. ఈ కెమికల్స్ ఉన్న హెయిర్ సీరమ్‌లు వాడటం వల్ల జుట్టు పలుచగా అయ్యే అవకాశం ఉంది.
పారాబెన్స్..
హెయిర్ సీరమ్‌లలో పారాబెన్‌లు ఎక్కువగా ఉండటం వల్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఇది వాడే బదులు కొబ్బరి నూనె జుట్టుకి అప్లై చేసి మసాజ్ చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల జుట్టు బాగా పెరుగుతుంది కూడా.
సిలికాన్..
హెయిర్ సీరమ్‌లలో సిలికాన్ ఉండటం వల్ల జుట్టు ఎక్కువగా జిడ్డుగా మారుతుంది. ఈ సీరమ్ వల్ల హెయిర్ ఎక్కువగా చిట్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి హెయిర్ సీరమ్స్ కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకుని కొనండి. లేదంటే మీ చేతులారా మీరే హెయిర్‌ని పాడుచేసుకునే ప్రమాదం ఉంది.
Also Read: నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? 3-2-1 రూల్ ట్రై చేయండి
ఇలాంటి కెమికల్స్ ఉన్నవి కొనడం కంటే.. మన ఇంట్లోనే నాచురల్‌గా హెయిర్ సీరమ్‌లు తయారు చేసుకోవచ్చు.
కొబ్బరి నూనెలో మెంతులు, మందారం పువ్వులు, ఉల్లిపాయలు వేసి బాగా మరిగించండి. చల్లారిన తర్వాత గాజు సీసాలో వడకట్టండి. ఈ ఆయిల్‌ని ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు. ఆ హెయిర్ సీరమ్ జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది.
కొబ్బరి నూనెలో కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మెంతులు వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత చల్లార్చి సీసాలో వడకట్టండి. ఈ సీరమ్ ను జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఇందులో వాడే పదార్ధాలు జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పని చేస్తాయి.
కొబ్బరి నూనెలో ఉసిరి పొడి వేసి జుట్టుకు అప్లై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది.
వీటితో పాటు బియ్యం నీళ్లను జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.