Prateek Jain: వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ జిల్లా ఎస్పీ, కలెక్టర్ హైదరాబాద్ రావాలని ఆదేశించింది.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం సేకరణ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం లగచర్ల గ్రామంలో సభ రణరంగాన్ని తలపించింది.
గ్రామస్తుల ముసుగులో బీఆర్ఎస్‌కి యూత్ వింగ్ నాయకులు ఎంటరై అధికారులపై దాడికి పాల్పడ్డారు. కార్లను ధ్వంసం చేశారు కూడా. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అధికారి వెంకట్‌రెడ్డిలపై దాడులు చేశారు.
కలెక్టర్ తప్పించుకోగా, పలువురు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్.
ALSO READ: జన్వాడ ఫామ్ హౌస్ కేసు.. విజయ్‌కి లుకౌట్ నోటీసులు
దాడికి కొన్నిగంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడాడు సురేష్. ఓ వైపు సురేష్‌తో మాట్లాడుతూ, మరోవైపు 6 సార్లు కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు పట్నం నరేందర్‌రెడ్డి. దీంతో ఈ దాడి ప్లాన్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది.
సురేష్‌పై ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులున్నాయి. చెల్లి వరస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినందుకు రేప్ కేసు నమోదైంది. ఆయనపై కేసులు తొలగించేలా పట్నం నరేందర్‌రెడ్డి సహాయం చేసినట్టు తెలుస్తోంది.
శాంతి భద్రతల సమస్యను తీసుకొచ్చి, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేలా స్కెచ్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీకి భూముల విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టరుకు తమ అభిప్రాయాన్ని తెలపకుండా డైరెక్ట్‌గా దాడి చేయడం వెనక పక్కా ఉందని పోలీసులు భావిస్తున్నారు.
తొలుత మండల కేంద్రంలో సభకు రాలేమని చెప్పిన వారంతా, కలెక్టర్‌ను లగచర్ల గ్రామానికి రప్పించారు పట్నం నరేందర్‌రెడ్డి అనుచరుడు సురేష్. సభ ప్రాంగణానికి తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో రైతు ముసుగులో కారు పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.
వికారాబాద్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, కలెక్టర్ ప్రతిక్ జైన్ హైదరాబాద్ రావాలని పిలుపు ఇచ్చింది. వెంటనే ఆ ఇద్దరు అధికారులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. వారితో సచివాలయంలో రివ్యూ నిర్వహించనున్నారు మంత్రి శ్రీధర్‌బాబు.