Tejaswini Beauty Secret: యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. తన బ్యూటీ సీక్రెట్‌ను రివీల్ చేశారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తానని తెలిపారు. ఆ తర్వాత ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు యోగా చేస్తాను. అంతే కాకుండా ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేస్తానని, యోగా ప్రారంభంలో 20 నిమిషాలు ప్రాణాయామం, తర్వాత వార్మ్ అప్స్ చేసి.. ప్రతి రోజు తప్పకుండా 12 సూర్య నమస్కారాలకు సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు. ఏది ఏమైనా ప్రతి రోజు గంటన్నర యోగా చేస్తానన్నారు.
ఆదివారం మాత్రం 108 సూర్య నమస్కారాలు చేస్తాను. యోగా తప్ప వాకింగ్ , జిమ్ లాంటి వాటికి వెళ్లనని తేజస్విని చెప్పారు. యోగా వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.. అంతే కాకుండా మైండ్ రిలాక్స్‌గా ఉంటుందని అన్నారు. గతంలో వాకింగ్‌కి తన భర్తత కలిసి వెళ్లే దానిని అని కానీ ఆయన వేగాన్ని అందుకోకపోవడం వల్లే.. ఇంట్లోనే యోగా చేసుకుంటానని తెలిపారు. అంతే కాకుండా 10 ఏళ్లుగా తాను యోగా చేస్తున్నాని వివరించారు ఆమె.