Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ ఇంకా ఎవరిని ప్రకటించలేదన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు ప్రకటించారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. అసలు అధ్యక్షుడిని నిర్ణయించడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. ఎంతమందైనా నామినేషన్లు వేయొచ్చని చెప్పారు. అన్ని ఆలోచించే పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు బండి సంజయ్. పార్టీ అధిష్ఠానానికి ఎవరి సంగతి ఏంటని అన్ని తెలుసన్నారు.
బండిసంజయ్ ఉన్నా.. లేకున్నా పార్టీ ఆగదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వందకు వంద శాతం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు.. అందుకోసం కట్టర్ బీజేపీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇక బీజేపీ బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వదని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను బండి సంజయ్ ఖండించారు. గతంలో నాకు, లక్షణ్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన పార్టీ ఇదే బీజేపీ. బీఆర్ఎస్ వాళ్లి నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వారే బీసీలకు తమ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: పొలిటికల్ హీట్.. సోషల్ మీడియాలో కొండా సుస్మిత సంచలన పోస్ట్..
కాగా.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే రాంచందర్‌రావుకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు రామచంద్రరావు. బీసీల్లో ఎంతో మంది సీనియర్లున్నా కాదని రామచంద్రరావును ఎంపిక చేయడంపై సొంత పార్టీలో సైతం అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొరుగు రాష్టం ఏపీ సీఎం చంద్రబాబు సూచన మేరకే బీజేపీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఛీప్ ఎంపికలో చంద్రబాబు పాత్రెంతో కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చేశారు.