Home remedies for cockroach: చాలా మంది ఇళ్లలో బొద్దింకలతో ఇబ్బంది పడుతుంటారు. చిన్న చిన్న బొద్దింకలు ఇంట్లోని మూలల్లో తిరుగుతూ ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా కిచెన్ లోని ఆహార పదార్థాలపై బొద్దింకలు తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే బొద్దింకలు ఇంట్లో నుండి పూర్తిగా పోవడానికి కొంత మంది రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఇవి అంత మంచివి కావు. ఖర్చు కూడా ఎక్కువే. అందుకే ఇంట్లోనే కొన్ని రకాల హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడటం మంచిది. వీటి వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడా, నిమ్మకాయ స్ప్రే:
బొద్దింకలను తరిమికొట్టడానికి బేకింగ్ సోడా, నిమ్మరసం చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఒక స్ప్రే బాటిల్‌లో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, సగం చెక్క నిమ్మ రసాన్ని కలపండి. దానికి అర కప్పు నీరు వేసి బాగా కలిపి వంటగది స్లాబ్, సింక్ అంచులు, బాత్రూమ్ ,బొద్దింకలు తరచుగా కనిపించే ప్రదేశాలపై స్ప్రే చేయండి. నిమ్మకాయ సువాసన, బేకింగ్ సోడా ప్రభావం క్షణాల్లోనే బొద్దింకలను అక్కడి నుండి తరిమివేస్తాయి.
కర్పూరం పొగ:
కర్పూరాన్ని పూజలో మాత్రమే కాకుండా.. బొద్దింకలను వదిలించడానికి కూడా ఉపయోగపడతాయి. ఒక గిన్నెలో రెండు కర్పూరాన్ని కాల్చి బొద్దింకలు కనిపించే గదిలో ఉంచండి. దీని పొగ బొద్దింకలు పారిపోయేలా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
వెనిగర్, నీరు :
వెనిగర్ మురికిని తొలగించడమే కాకుండా, బొద్దింకలను తరిమికొట్టడంలో కూడా సహాయపడుతుంది. స్ప్రే బాటిల్‌లో వెనిగర్ నీటిని సమాన పరిమాణంలో కలపండి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఇంటి మూలల్లో.. నేలపై, వంటగదిలో.. ఫ్రిజ్ వెనుక స్ప్రే చేయండి. దీని బలమైన వాసన బొద్దింకలను ఆ ప్రదేశం నుండి దూరం చేస్తుంది. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇంట్లో నుండి బొద్దింకలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో మూలల్లో ఉన్న బొద్దింకలు కూడా చనిపోతాయి. వెనిగర్ బొద్దింకలను చంపడంలో చాలా ప్రభావవంతగా పని చేస్తుంది.
Also Read: ఒత్తైన జుట్టు కోసం.. కొరియన్స్ ఏం చేస్తారో తెలుసా ?
బొద్దింకలు ఇంటి అందం, ఆరోగ్యం రెండింటికీ ముప్పు. కానీ వాటిని ఎదుర్కోవడం ఇకపై కష్టం కాదు. పైన చెప్పిన హోం రెమెడీస్ ప్రభావవంతంగా ఉండటమే కాకుండా, చౌకగా, సురక్షితంగా కూడా ఉంటాయి. ఈ సారి బొద్దింకలు మీకు కనిపించినప్పుడు, భయపడకండి, ఈ హోం రెమెడీస్ తో ఇంటి నుండి బయటకు వెళ్ళి పోతాయి. అందుకే వీటిని వాడటం చాలా మంచిది. మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ హోం రెమెడీస్ తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇవి మంచి ఫలితాలను అందిస్తాయి. బొద్దింకలు ఎక్కువగా ఉన్న వారు వీటిని ట్రై చేయడం చాలా మంచిది.