Suneil Narang: ఏసియన్ సినిమాస్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ త్వరలోనే కుబేర సినిమా(Kubera Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Danush), రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమా వివిధ భాషలలో విడుదలకు సిద్ధమవుతుంది.. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా ప్రారంభించారు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారంగ్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
థియేటర్లు బంద్…
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ ఇద్దరు నిర్మాతలు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా థియేటర్ల బంద్, పవన్ కళ్యాణ్ తో గొడవ? నలుగురు ప్రొడ్యూసర్ల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ఆసక్తికరమైన సమాధానాలను బయటపెట్టారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో ఎగ్జిబిటర్లు థియేటర్ల బందుకు పిలుపునిచ్చారని అందుకు నలుగురు ప్రొడ్యూసర్లు కూడా సహకరించారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తల గురించి ఈ ఇద్దరు నిర్మాతలు మాట్లాడుతూ… ఎగ్జిబిటర్లు వారి సమస్యను వచ్చి మా వద్ద చెప్పకున్న మాట వాస్తవమే, మీరు మా సమస్యను తీర్చకపోతే థియేటర్ల బందుకు పిలుపునిస్తామని చెప్పారు అందులో తప్పేమీ లేదు. వారి అభిప్రాయాన్ని వాళ్లు తెలిపారు. ఇక థియేటర్ల బంద్ అని ఎక్కడ అధికారకంగా ప్రకటన చేయలేదు.
సురేష్ బాబు…
ఇక ఈ విషయాన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా మిస్ గైడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లడంతో ఆయన పూర్తి విషయం తెలియక ఇండస్ట్రీ గురించి అలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆ నలుగురు ప్రొడ్యూసర్లు అంటూ వార్తలు బయటకు వచ్చాయి,ఈ వార్తలు వచ్చినప్పుడు అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు మాకు సంబంధం లేదని చెప్పారు. ఇక నేను కూడా నాకు సంబంధం లేదని చెప్పాను. ఇక మిగిలింది సురేష్ బాబు ఆయన కూడా రేపో మాపో ఇదే మాట చెబుతారని సునీల్ నారంగ్ తెలిపారు.
మా సినిమా కూడా విడుదలవుతుంది కదా…
ఇక ఆ నలుగురు నిర్మాతలలో మీరెవరు లేకపోతే మరి ఆ నలుగురు ఎవరు అంటూ ప్రశ్న ఎదురవడంతో అది వాళ్లకే తెలియాలని సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకోవడానికి మేము ఎవరు? ఆయన సినిమాని మేమెందుకు ఆపుతాము, అది మా వల్ల సాధ్యం కాదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కోసమే థియేటర్లు బంద్ అని ప్రకటిస్తే ఇప్పుడు మా సినిమా కూడా రిలీజ్ అవుతుంది కదా మాకి కూడా నష్టమే కదా అంటూ సునీల్ తెలిపారు. ఇదంతా తప్పుగా అర్థం చేసుకుని ఉద్దేశపూర్వకంగానే ఈ సమస్యను బయటకు తెచ్చారని అంతకుమించి అక్కడ జరిగిందేమీ లేదు అంటూ రామ్మోహన్ రావుతో పాటు సునీల్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక కుబేర సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాబావం వ్యక్తం చేశారు.