Diy Coffee Face Mask: ముఖం అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అంతే కాకుండా కొంతమంది ఇంట్లోనే హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు. కాఫీ పౌడర్‌లో కొన్ని రకాల పదార్థాలను కలిపి హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడవచ్చు.
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు అవసరమైన మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు ఎక్స్‌ఫోలియేట్ చేయడం, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న కాఫీ పౌడర్‌తో ఫేస్ మాస్కులను ఎలా తయారు చేసుకుని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీతో ఫేస్ మాస్కుల తయారీ:
కావాల్సినవి:
కాఫీ, హనీ ఫేస్ మాస్క్
ఎలా తయారు చేయాలి: 1 టీస్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి. దానికి 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఈ పేస్ట్‌ను ముఖంపై సున్నితంగా రాయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.
ప్రయోజనం: ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా మెరుస్తుంది. అంతే కాకుండా ఈ మాస్క్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి , మాయిశ్చరైజ్ చేయడానికి గొప్ప మార్గం. కాఫీ చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా ఇందులో వాడిన తేనె చర్మానికి తేమను అందిస్తుంది.
2.కాఫీ పౌడర్, కొబ్బరి నూనె:
ఎలా తయారు చేయాలి: 1 టీస్పూన్ కాఫీ పొడిలో 1 టీస్పూన్ కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయండి. తర్వాత మృదువుగా మసాజ్ చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి.
ప్రయోజనం: ఈ మాస్క్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతే కాకుండా పొడి అలసిపోయిన చర్మానికి కాఫీ , కొబ్బరి నూనె మాస్క్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా చేస్తుంది. కాఫీ ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.