BigTV English

Diy Facial: మెరిసే చర్మం కోసం.. ఇంట్లోనే ఈ ఫేసియల్స్ ట్రై చేయండి!

Diy Facial: మెరిసే చర్మం కోసం.. ఇంట్లోనే ఈ ఫేసియల్స్ ట్రై చేయండి!

Diy Facial: మీరు హెల్దీగా ఉన్నారా? లేదా?.. సంతోషంగా ఉన్నారా? లేదా? అని.. మీ ఫేస్ చూసి చెప్పేయొచ్చు తెలుసా.. ఎండలో ఎక్కువ సేపు తిరిగినా ఫేస్ డల్‌గా మారుతుంది. అలాగే ప్రతిరోజు కొంచెం పని ఎక్కువైన.. నిద్ర తక్కువైన కూడా అది మీ ఆరోగ్యాన్ని.. ప్రభావితం చేయడమే కాకుండా.. ముఖాన్ని నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది. పైగా నీరసంగా, అలసిపోయినట్లు ఉంటారు. ఇలాంటి సమయంలో ఎంత మేకప్ వేసుకున్న, ఎంత అందమైన డ్రెస్సు వేసుకున్న డల్ గానే కనిపిస్తారు. నిస్తేజంగా మారిన మీ ముఖాన్ని.. కాంతివంతంగా, తాజాగా మార్చడానికి ఈ టిట్కాలు పాటించండి. మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టెప్-1 ఫేస్ క్లీనింగ్
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పాలు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయండి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి. ముఖంపై మురికి, మట్టి తొలగిపోతుంది.. ఇప్పుడు సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

స్టెప్-2 ఫేస్ స్క్రబ్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో మూడు టేబుల్ స్పూన్ షుగర్, రెండు టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.


స్టెప్-3 ఫేస్ టోనర్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్స స్పూన్ ఆలోవెరా జెల్, రోజ్ వాటర్, రెంటు టేబుల్ స్పూన్ బియ్యంపిండి కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి.

స్టెప్-4 ఫేస్ మాస్క్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో అరటిపండు గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ తేనె, టీ స్పూన్ ముల్తానీ మిట్టి కలిపిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా పైన చెప్పిన విధంగా రెండు వారాలకు ఒకసారి చేస్తే.. ముఖం తాజాగా, కాంతివంతంగా, ఉంటుంది. అంతేకాదు ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి యవ్వనంగా కనిపిస్తారు.

ముఖం కాంతివంతంగా, మెరిసేలా చేయడానికి  ఈ చిట్కా కూడా పాటించండి.. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.

కొబ్బరి పాలు, కుంకుమ పువ్వు ఫేస్ మాస్క్
చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడానికి.. కుంకుమ పువ్వు చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం చిన్న బౌల్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు, కుంకుమ పువ్వు కలిపి ముఖానికి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం తాజాగా, అందంగా కనబడుతుంది.

Also Read: ఐశ్వర్య రాజేష్ తాగిన ‘గోల్డెన్ క్యాపచినో’ ధర ఎంతో తెలుసా? దాన్ని ఎలా తయారు చేస్తారంటే?

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×