BigTV English

RR vs RCB: బెంగుళూరుతో చేతిలో ఓటమి.. నేరుగా వైన్స్ కు వెళ్లి పెగ్గు వేసిన రాజస్థాన్ CEO

RR vs RCB: బెంగుళూరుతో చేతిలో ఓటమి.. నేరుగా వైన్స్ కు వెళ్లి పెగ్గు వేసిన రాజస్థాన్ CEO

RR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఎవరు ఊహించని రీతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో ఏకంగా 11 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిచ్చు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. వాస్తవానికి ముందు నుంచి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటే చివర్లో బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో బెంగళూరు విజయం సాధించింది. ఈ నేపథ్యంలోరాజస్థాన్ రాయల్స్ సీఈఓ జాకీ లాష్ ముక్రమ్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


బెంగళూరు దెబ్బకు వైన్స్ వెళ్లిన రాజస్థాన్ సీఈవో

గురువారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో RCB గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ దెబ్బకు… రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ తో పాటు యాజమాన్యానికి దిమ్మతిరిగిపోయింది. గెలిచే మ్యాచ్ ను చేజేతులా పోగొట్టుకున్నారు రాజస్థాన్ ఆటగాళ్లు. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన అనంతరం వెంటనే స్టేడియం నుంచి.. బయటకు వెళ్లారు రాజస్థాన్ సీఈఓ జాకీ లాష్ ముక్రమ్. బయటకు వచ్చిన ఆయన వెంటనే… లిక్కర్ మార్ట్ కు వెళ్లారు. స్టేడియం బయట ఉన్న టానిక్ అనే ప్రముఖ మద్యం దుకాణానికి వెళ్లి పెగ్గులు వేశారు.


దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. సీఈఓ జాకీ లాష్ ముక్రమ్ మద్యం సేవించే ఫోటోలు బయటకు రాలేదు కానీ… టానిక్ షాప్ నకు వెళ్లిన వీడియో మాత్రం బయటకు వచ్చింది. స్టేడియం నుంచి బయటకు వచ్చిన రాజస్థాన్ సీఈవో జాకీ ని.. ఓ క్రీడా అభిమాని వీడియో తీశారు. బెంగళూరు దెబ్బకు రాజస్థాన్ సీఈఓ వైన్స్ కు వెళ్తున్నాడని… ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియో చూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

బెంగళూరు తో పెట్టుకుంటే దిమ్మతిరిగి పోవాల్సిందే

బెంగళూరు తో పెట్టుకుంటే ఏ జట్టైనా మట్టిలో కలిసి పోవాల్సిందే అంటూ ఈ సందర్భంగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హేజిల్ వుడ్ అలాగే విరాట్ కోహ్లీ దెబ్బకు…. రాజస్థాన్ సీఈఓ జాకీ లాష్ ముక్రమ్… పెగ్గు వేసేదాకా వెళ్ళాడని చురకలాంటిస్తున్నారు. బెంగళూరు ఆటగాళ్ల దెబ్బ అంటే అలాగే ఉంటుందని… 90 కాదు ఫుల్ బాటిల్ తాగినా కూడా ఆ కిక్కు దిగదు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

సొంత గ్రౌండ్ లో మొదటి విజయం

ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ఇప్పటివరకు సొంత గ్రౌండ్ అయిన చిన్నస్వామి లో బెంగళూరు విజయం సాధించలేదు. ఇప్పటివరకు వరుసగా మూడు ఓటమిలు చవిచూసింది. కానీ గురువారం రోజున రాజస్థాన్ రాయల్స్ పై మాత్రం సొంత గడ్డపై విజయం సాధించింది బెంగళూరు. దీంతో పాయింట్లు పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది బెంగళూరు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×