Pahalgam Terror Attack: పహల్ గామ్ టెర్రర్ అటాక్ తో కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన టూరిస్టులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కాశ్మీర్ అందాలు చూడ్డం మాట అటుంచితే ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితి చేరుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో సుమారు 2 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్ లోయ సహా ఇతర ప్రాంతాలను చూసేందుకు వెళ్లారు. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాశ్మీర్ నుంచి తరలించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్ల ద్వారా వారని తరలిస్తోంది.
రిజర్వేషన్ లేకున్నా ప్రయాణానికి అనుమతి
పహల్ గామ్ సహా కాశ్మీర్ లో చిక్కుకున్న పర్యాటకులను సేఫ్ గా తరలించేందుకు.. జమ్మూ, కాశ్మీర్ నుంచి న్యూఢిల్లీ వరకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది ఇండియన్ రైల్వే. రిజర్వేషన్ లేకపోయినా రైల్లో ప్రయాణం చేసేలా అధికారులు అనుమతిస్తున్నారు. కత్రా, జమ్మూ స్టేషన్ల నుంచి అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో రిజర్వేషన్ ఉన్న ప్రయాణీకులతో పాటు రిజర్వేషన్ లేని ప్రయాణీకులను సైతం ఢిల్లీకి తరలిస్తున్నారు.
పర్యాటకులకు రైళ్లలో ఉచిత భోజనం
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (SVDK) నుంచి బయల్దేరిన ప్రత్యేక రైలులో జమ్మూ ప్రాంతం నుంచి సుమారు 200 మంది ప్రయాణికులకు వసతి కల్పించారు. IRCTC ద్వారా ఆహారం, క్యాటరింగ్ ఏర్పాట్లు చేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రద్దీని తగ్గించడానికి 72 బెర్త్ లతో కూడిన అదనపు థర్డ్ ఎసి కోచ్ ను రైలుకు యాడ్ చేశారు. అదనపు కోచ్‌ను ప్లాన్ చేశారు. అర్థరాత్రి వరకు చిక్కుకుపోయిన ప్రయాణీకుల తరలింపు ప్రక్రియ కొనసాగింది. టూరిస్టులకు అసరమైన ఆహారాన్ని కూడా అందించారు. జమ్మూ, కాత్రా స్టేషన్ల నుంచి అదనపు ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది భారతీయ రైల్వే.
Read Also: వారికి ఊహకు అందని శిక్ష.. వెంటాడి వేటాడుతాం.. పాక్‌కు మోదీ మాస్ వార్నింగ్
పహల్ గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి
ఇక మంగళవారం పహల్ గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కుగా టూరిస్టులు ఉన్నారు. ఒకరిద్దరు స్థానికులు కూడా చనిపోయారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల కోసం ఉత్తర రైల్వే కత్రా నుంచి న్యూఢిల్లీకి రిజర్వేషన్ లేని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పహల్ గామ్ దాడి తర్వాత జమ్మూలోని వివిధ ప్రదేశాలలో అనేక మంది పర్యాటకులు తమ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందించేందుకు జమ్మూ తావి, కత్రా స్టేషన్లలో హెల్ప్ డెస్క్ లు ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: పహల్ గామ్ లో ఉగ్రదాడి, పాక్ ఎంబసీలో కేక్ కటింగ్.. వీడియో వైరల్!