BigTV English

Holiday Heart Syndrome: హాలిడే హార్ట్ సిండ్రోమ్ గురించి తెలుసా మీకు? ఇది గుండెను ఎంతగా ప్రభావితం చేస్తుందంటే

Holiday Heart Syndrome: హాలిడే హార్ట్ సిండ్రోమ్ గురించి తెలుసా మీకు? ఇది గుండెను ఎంతగా ప్రభావితం చేస్తుందంటే

హాలిడే హార్ట్ సిండ్రోమ్ అనేది తేలికపాటి సమస్య కాదు, ఇది ప్రాణాంతకం అయినదని చెబుతున్నారు వైద్యులు. దీనికి కూడా చికిత్స అవసరమని వారు వివరిస్తున్నారు. హాలిడే హార్ట్ సిండ్రోమ్ అనేది గుండెపోటు, స్ట్రోక్ వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అసలు హాలిడే హార్ట్ సిండ్రోమ్ అంటే ఏమిటో అన్న అనుమానం మీలో వచ్చే ఉంటుంది.


హాలీడే హార్డ్ సిండ్రోమ్ అంటే
హాలిడేలు అంటే సెలవులు ఎక్కువగా పండగలు, వేడుకలు సమయంలోనే వస్తాయి. ఆ సమయంలో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య ఎక్కువే. అలాగే ఉప్పగా ఉండే స్నాక్స్ ను అధికంగా తింటారు. ఇతర తినుబండారాలు స్వీట్స్ తింటూనే ఉంటారు. ఆ తిండి ప్రభావం మీ గుండెపై పడుతుంది. ఇది మీ గుండెను వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఆ సమయంలోనే హాలిడే హార్ట్ సిండ్రోమ్ ఎవరికైనా రావచ్చు. అంటే గుండె పోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె సమస్యల బారిన పడిన వారిలో ఈ హాలిడే హార్ట్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

ఈ హాలిడే హార్ట్ సిండ్రోమ్ అనేది న్యూ ఇయర్ కు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా అధికంగా ఆల్కహాల్ తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది క్రమ రహిత హృదయ స్పందనలకు కారణమవుతుంది. గుండెదడను పెంచేస్తుంది. అందుకే న్యూ ఇయర్ సమయంలో హాలిడే హార్ట్ సిండ్రోమ్ ఎక్కువ మందికి వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారి కూడా ఉన్నారు.


హాలిడే హార్ట్ సిండ్రోమ్ రాకుండా ఉండాలంటే ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వాలి. సెలవులు వచ్చినా, పండగలు, వేడుకలు వచ్చినా కూడా అతిగా తినకూడదు. అతిగా ఆల్కహాల్ తాగకూడదు. ఉప్పగా ఉండే ఆహారాలకు, పంచదారతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. అల్పాహారం భోజనం వంటివి తేలికపాటిగా చేయాలి. ఆల్కహాల్ పార్టీకి వెళ్తే మితంగా తాగేందుకు పరిమితం అవ్వాలి. ఆ ఆనందంలో అపరిమితంగా తాగి ప్రాణానికి చేటు తెచ్చుకోకూడదు.

సెలవుల్లో అతిగా ఆనంద పడుతూ స్నేహితులతో గడుపుతూ తినడం తాగడం పై నియంత్రణ కోల్పోతారు. ఎంతోమంది అందుకే ఆ సమయంలో జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండాలి. విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏ సమస్యకైనా మీరు మందులు వాడుతున్నట్టయితే వాటిని ఆపకుండా వేసుకోవాలి.

గుండె కోసం రోజుకొకసారి గ్రీన్ టీ తాగాలి. అలాగే కాయ ధాన్యాలు ఉండే ఆహారాన్ని అధికంగా తినాలి. ఆకుపచ్చని కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా అవిసె గింజలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. కొవ్వు అధికంగా ఉండే రెడ్ మీట్ వంటివి తాగడం తినడం మానేయండి. ఆల్కహాల్ ను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లీన్ ప్రోటీన్లు ఉన్న మాంసం, తక్కువ కొవ్వు ఉన్న పాలు, ఆరోగ్యకరమైన పండ్లు కూరగాయలు తినేందుకు ప్రయత్నించండి.

నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే మటన్, బీఫ్ వంటివి ఎంత తక్కువగా తింటే అంత మంచిది. చికెన్, చేపలు వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సోడాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సోడా తాగే వారు త్వరగా బరువు పెరుగుతారు. అలాగే ఉబకాయం, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా త్వరగా వస్తాయి.

Also Read: చలికాలంలో తక్కువగా నీరు త్రాగుతున్నారా ? జాగ్రత్త

కుకీలు, కేకులు, మఫిన్లు వంటివి తినకుండా ఉండడమే మంచిది. ఇవి పంచదార, మైదాలతో నిండి ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి. అధిక ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి గుండెజబ్బులకు కారణం అవుతాయి. ఇలాంటివన్నీ కూడా సెలవుల్లోనే బంధువులతో కలిసినప్పుడు అధికంగా తింటూ ఉంటాము. అందుకే ఇలాంటి తిండి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టే దీన్ని హాలిడే హార్డ్ సిండ్రోమ్ అని పిలవడం మొదలుపెట్టారు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×