Water : నీరు శరీరానికి చాలా ముఖ్యం. జీవక్రియలు సక్రమంగా జరగాలంటే శరీరంలో తగినంత నీరు తప్పకుండా ఉండాలి. ఇదిలా ఉంటే చాలా మంది చలికాలంలో తక్కువ పరిమాణంలో నీళ్లు త్రాగుతూ ఉంటారు. కొన్ని సార్లు ఈ పరిమాణం మరి తక్కువగా మారుతుంది. కానీ ఇది శరీరంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
చలికాలంలో నీరు తాగాలనే కోరిక తగ్గుతుంది. ఫలితంగా కొన్నిసార్లు శరీర అవసరానికి అనుగుణంగా నీరు అందదు. శరీరం సక్రమంగా పనిచేయాలంటే శరీరంలో తగినంత నీరు ఉండటం అవసరం. ఈ కారణంగా చలికాలంలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు . శరీరంలో తగినంత నీరు లేకపోతే అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
చలికాలంలో తక్కువ నీరు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వేసవిలో దాహం తక్కువగా అనిపించినా శరీరానికి నీరు అవసరం. మరి చలికాలంలో తక్కువ నీరు తాగడం వల్ల కలిగే నష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో తక్కువ నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు:
చర్మం పొడిబారడం: చలికాలంలో గాలి పొడిగా ఉంటుంది. తక్కువ నీరు తాగడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది. ఇది దురద, పగుళ్లు, ఇతర చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది.
జీర్ణ సమస్యలు: తగినంత నీరు తాగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతో మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
కిడ్నీ సమస్యలు: కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే నీరు అవసరం. తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర కిడ్నీ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
అలసట, బలహీనత: శరీరంలో నీటి కొరత అలసట, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.
ఇన్ఫెక్షన్ ప్రమాదం: తగినంత నీరు త్రాగకపోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కీళ్ల నొప్పులు: శరీరంలో నీరు లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. అందుకే శరీరానికి తగినంత నీరు త్రాగడం మంచిది.
శీతాకాలంలో మీరు ఎంత నీరు త్రాగాలి ?
ఒక సాధారణ వ్యక్తి రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.
శారీరక శ్రమ ,సీజన్ ప్రకారం నీరు త్రాగే పరిమాణాన్ని తప్పకుండా పెంచాలి.
నీరు కాకుండా, మీరు రసం, సూప్, జ్యూస్ లను కూడా తీసుకోవచ్చు.
Also Read: పసుపులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది తెలుసా ?
చలికాలంలో తగినంత నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు :
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
శక్తి స్థాయిలను పెంచుతుంది.
ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.