BigTV English

Cumin And Jaggery Water: జీలకర్ర నీళ్లలో ఇది కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Cumin And Jaggery Water: జీలకర్ర నీళ్లలో ఇది కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Cumin And Jaggery Water: ఉదయాన్నే పరిగడుపున నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లు, మెంతుల నీళ్లు, జీలకర్ర నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా జీలకర్ర నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారని, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతారు. అయితే చాలా మందికి కేవలం జీలకర్ర నీటిని మాత్రమే అలవాటుగా ఉంటుంది. కానీ జీలకర్ర నీటిలో బెల్లంతో కలిపి తాగడం వల్ల అద్భుతమన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల రక్తహీనత వంటి అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ నీటిలో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు, పోషకాలు వంటివి శరీరానికి పుష్కలంగా అందుతాయి.


జీలకర్ర నీటిని తరచూ తాగడం వల్ల జీర్ణక్రియ, మలబద్ధకం వంటి అనేక రకాల కడుపు సంబంధింత సమస్యలను నివారించుకోవచ్చు. అంతేకాదు జీలకర్ర బెల్లం నీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థకు అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి జీలకర్ర, బెల్లం తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు నడుము నొప్పి నివారణకు అద్భుతంగా తోడ్పడతాయి. ముఖ్యంగా వెన్నునొప్పి, తుంటి వంటి నొప్పులతో బాధపడుతున్న వారికి శాశ్వతంగా ఉపశమనం కలిగిస్తుంది. బెల్లం, జీలకర్ర నీటిని తాగడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోయి, బ్లడ్ ప్యూరిఫయర్ గా పనిచేస్తుంది.

పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారికి ఆడవారికి ఈ నీరు చక్కటి ఔషధం అనే చెప్పాలి. విపరీతమైన నడుము, కడుపు నొప్పి ఉన్నవారు రోజుకి ఒక గ్లాసు ఈ నీటిని తీసుకోవడం వల్ల చక్కటి పరిష్కారం ఉంటుంది. తలనొప్పి వంటి సమస్య ఉన్నా కూడా త్వరగా ఉపశమనం కలుగుతుంది. అందువల్ల తరచూ ఉదయం బెల్లం, జీలకర్ర నీటిని తీసుకోవడం అన్ని అనారోగ్య సమస్యలకు మంచిదని నిపుణులు చెబుతున్నారు.


Tags

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×