శుభాన్షు శుక్లా అంతరిక్ష కేంద్రం నుండి భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈ మిషన్ పూర్తవడంతో పాటు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి పరిశోధన చేసిన మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్లా గుర్తింపు పొందారు. ఆక్సియం 4 మిషన్లో భాగంగా శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని చేశారు. అయితే ఇప్పుడు శుభాన్షు శుక్లా గురించి వివరాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతరిక్షానికి వెళ్ళొచ్చిన శుభాన్షు శుక్లాకు జీతం ఎంత ఇస్తారు? అనేది చాలామందికి ఉన్న సందేహం.
శుభాన్షు శుక్లా జూలై 15న తన బృందంతో కలిసి భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రంలో దాదాపు 18 రోజులు ఆయన నివసించారు. నిజానికి మొదటి 14 రోజులు మాత్రమే షెడ్యూల్ చేశారు. కానీ శాస్త్రీయ పరిశోధనలు, కొన్ని అవాంతరాల వల్ల మరొక నాలుగు రోజులు పాటు అదనంగా అక్కడ ఉండాల్సి వచ్చింది. జూన్ 25న ఆయన అంతరిక్ష యాత్రను ప్రారంభించారు.0
జీతం ఎంత ఇస్తారు?
భారత వైమానిక దళంలో పైలెట్ గా పనిచేసిన శుభాన్షు శుక్లాకు 200 గంటల విమానయాన అనుభవం ఉంది. అయితే అంతరిక్షంలో 18 రోజులు పాటు ఉన్నందుకు ఆయనకు ఎంత జీతం ఇస్తారో తెలుసా? అసలు అతనికి జీతమే ఇవ్వరు. దాదాపు మూడు వారాలు అంతరిక్షంలో గడిపిన కూడా శుభాంశు శుక్లాకు ఎలాంటి జీతము అందదు. ఈ మిషన్ కు వెళ్లే ముందే శుభాన్షు శుక్లాకు ఇస్రో ఈ విషయాన్ని తెలియజేసింది. రాబోయే మిషన్లలో సహాయపడే అనుభవాన్ని పొందడం కోసమే శుభాన్షు శుక్లాను పంపిస్తున్నట్టు ముందే వివరించింది. శుభాంశు శుక్లాను అంతరిక్ష యాత్రకు పంపించేందుకు అతనికి శిక్షణ ఇచ్చేందుకు శాస్త్రీయ పరిశోధన కోసం ఇస్రో 548 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాబట్టి శుభాంశు శుక్లాకు జీతం రూపంలో ఇస్రో ఏమీ ఇవ్వదు.
శుభాంశుకు ఎలాంటి జీతం లభించక పోయినా అతనికి వచ్చిన అనుభవం మాత్రం ఎంతో అపారమైనది. 2027 లో భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత మిషన్ అయినా గగనయాన్ కు అతను అనుభవం, జ్ఞానం, సమాచారం ఎంతో అవసరం. ఆ కార్యక్రమంలో శుక్లా ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉంది. అతని శిక్షణ కోసమే 500 కోట్లకు పైగా ఖర్చు చేసింది.. కాబట్టి ఇస్రో అతనికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించలేదు.