BigTV English

princess’s curse: జంటలు ఆ ప్రాంతానికి వెళితే బ్రేకప్ అయిపోతుందట, దాని వెనుక యువరాణి శాపం

princess’s curse: జంటలు ఆ ప్రాంతానికి వెళితే బ్రేకప్ అయిపోతుందట, దాని వెనుక యువరాణి శాపం

ఒకప్పుడు పెళ్లి చూపులు, పెళ్లి… ఆ తర్వాతే భార్యాభర్తలుగా కలిసి జీవించడం మొదలయ్యేది. కానీ ఆధునిక సమాజంలో అంతా మారిపోయింది. పెళ్లికి ముందే హనీమూన్ చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. పెళ్ళికి ముందే ప్రేమికులుగా ఎన్నో ప్రాంతాలకు ట్రావెలింగ్ కోసం వెళుతూ ఉంటారు. అయితే ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వెళ్లిన జంటలు ఎక్కువగా విడిపోతాయని ఒక ప్రచారం ఉంది. ఇది ఆ ద్వీపం శాపమని కూడా అంటారు.


బ్రేకప్ అయిపోతుందట
ఇండోనేషియాలోని బాలి ద్వీపం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది. ఇది అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. చరిత్ర సంస్కృతిలో కూడా ఎంతో గొప్పది. 2024లోనే బాలి ద్వీపానికి 6.3 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. ఇందులో ఎక్కువగా హనీమూన్ జంటలే ఎక్కువ. అలాగే ప్రేమికులు కూడా అధికమే. బాలి ద్వీపంలో ఎంజాయ్ చేయడానికి పెళ్లి కాని జంటలు ఎంతోమంది వస్తుంటారు. ఇలా పెళ్లి కాని జంటలో బాలిని సందర్శించవద్దని కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే బాలిని సందర్శించి వెళ్ళాక వారికి బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువట.

బాలి.. ఒక శాపం
పెళ్ళికాని జంటలు బాలి వెళ్లొచ్చాక విడిపోవడం అధికంగా మారినట్టు చెబుతున్నారు. ద్వీపానికి వెళ్లిన తర్వాత చాలామంది తమ విడిపోయిన కథలను రెడ్డిట్ లో పంచుకుంటున్నారు. రెడ్డిట్ ప్రకారం ఒక వ్యక్తి మా హనీమూన్ కోసం బాలికి వెళ్ళాము, ఆరు నెలల తర్వాత విడాకులు తీసుకున్నాము అని చెప్పాడు. అలాగే మరొక ప్రేమికురాలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే నా ప్రియుడికి నాకు గొడవలు వచ్చి విడిపోయాము అని రాసుకొచ్చింది. ఇక రెండేళ్లుగా ప్రేమ బంధం లో ఉన్న ఒక జంట బాలి వెళ్ళొచ్చాక విడిపోయినట్టు రెడ్డిట్లో తమ కథను పంచుకున్నారు.


ఆ ఆలయమే కారణం
అందుకే బాలి వెళ్లొచ్చిన తర్వాత కొత్త జంటలో లేదా ప్రేమికులు విడిపోయే అవకాశం ఎక్కువనే ప్రచారం అధికమైపోయింది. బాలి నైరుతి తీరంలో ఒక రాతి గుహ ఉంటుంది. దానిపై ఉండే ఆలయం ద్వీపంలోని అత్యంత పవిత్రమైన, సుందరమైన ప్రదేశంగా చెప్పుకుంటారు. 16వ శతాబ్దంలో పూజారి డాంగ్ హయాంగ్ దీన్ని స్థాపించినట్టు భావిస్తారు. ఇది ఒక హిందూ ఆలయంగా చెబుతారు. సముద్ర దేవతలకు అంకితం చేశారని.. ప్రకృతికి, దైవానికి మధ్య సమతుల్యతను ఈ ఆలయం సూచిస్తుందని అంటారు. సముద్రపు అలలు చుట్టూ ఎగిరిపడుతుండగా… అధిక ఆటుపోట్లను తట్టుకుంటూ సముద్రంలో తేలుతున్నట్టు కనబడడమే ఈ ఆలయం ప్రత్యేకత.

ఇదే యువరాణి శాపం
బాలిలో ఉన్న జానపద కథలు బట్టి జావా నుండి ఒక బ్రాహ్మణ యువరాజు, ఒక యువరాణితో ఇక్కడికి పారిపోయి వచ్చారు. వారు తమ ప్రేమను గెలిపించుకోవడానికి తమ దేశాన్ని వదిలి అక్కడ వారి నుండి తప్పించుకొని ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఇదే ప్రదేశంలో వారు కొంతకాలం సంతోషంగా గడిపారు. సన్నిహితంగా గడిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత యువరాజు, యువరాణిని ఇక్కడే విడిచిపెట్టి వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆమె హృదయ విదారకంగా ఏడ్చింది. తాను మోసపోయినట్టు గుర్తించింది. ఆమె దుఃఖంతో, కోపంతో అక్కడ భూమిని శపించిందని నమ్ముతారు. అక్కడి ఆలయాన్ని సందర్శించే ఏ జంట అయిన ఆరునెలల్లోపు విడిపోతారని ఆమె శపించిందని కథలో కూడా ప్రచారంలో ఉన్నాయి.

మొదట్లో దీన్ని నిజమనే నమ్మారు. కానీ ఆ తర్వాత మూఢ నమ్మకంగా చెప్పుకొని పట్టించుకోవడం మానేశారు. కానీ ఇప్పుడు ఎన్నో జంటలు బాలి వెళ్లొచ్చాక విడిపోవడంతో ఈ కథ నిజమేనని నమ్ముతున్న వారి సంఖ్య అధికమైపోయింది. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. కొంతమంది అది కేవలం మూఢనమ్మకంగా కొట్టి పడేస్తున్నారు. బాలిలోనే తన ప్రియుడిని తొలిసారి కలిశానని, మూడేళ్లపాటు అక్కడే కలిసి జీవించామని, తర్వాత పెళ్లి కూడా చేసుకున్నామని, ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఏ మూఢనమ్మకమైన ఎదుటివారి ఆలోచనా శక్తి, నమ్మకాలపైనే ఆధారపడి ఉంటుంది. కొందరు నమ్మితే.. మరి కొందరు కొట్టి పడేస్తారు.

Related News

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Vande Bharat Trains: అందుబాటులోకి 20 కోచ్‌ ల వందేభారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు!

Railway tunnels: సొరంగాల్లో సైరన్ ప్రతిధ్వని.. నంద్యాల రైల్వే టన్నెల్స్ రహస్యాలు ఇవే!

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Railway Guidelines: ఆ టైమ్ లో రైల్లో రీల్స్ చూస్తున్నారా? ఇత్తడైపోద్ది జాగ్రత్త!

Big Stories

×