BigTV English

Side Effects of Alcohol: సడన్‌గా మద్యం మానేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Side Effects of Alcohol: సడన్‌గా మద్యం మానేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Effects of Alcohol on Body: మద్యం తాగడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. ఆల్కహాల్ తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినా..దీని వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు చాలా ఎక్కువ. ఒకప్పుడు పండగకో..పబ్బానికో మద్యం తాగే వారు. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆల్కహాల్ సేవిస్తున్నారు. ఈ అలవాటు అతిగా ఉంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.


మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయినా చాలా మంది మద్యం తాగడం మానుకోవాలని అనుకోరు. అయితే మద్యం రోజూ తాగినా అప్పుడప్పుడు తాగినా సరే ఇది శరీరంలోకి వెళ్లి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది.ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగతుందనే విషయం చాలా మందికి తెలియదు.

ఆల్కహాల్ తాగిన తర్వాత అది పొట్టలోని చిన్న పేగులోకి వెళుతుంది. అనంతరం అది అల్డిహైడ్స్ రసాయనంగా విడిపోతుంది. అయితే ఈ అల్డిహైడ్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది రక్తం ద్వారా కాలేయాన్ని చేరుకుని దానిని దెబ్బతీస్తుంది. అయితే తక్కువ సమయంలోనే ఎక్కువ ఆల్కహాల్ తాగితే శరీరంలో అల్డిహైడ్ల పరిమాణం పెరుగుతుంది.


Also Read: Peas Benefits For Health: ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా.. అయితే బఠాణీలు ట్రై చేయండి

మహిళలయినా పురుషులయినా ఆల్కహాల్ ప్రభావం ఇద్దరిపై ఒకేలా ఉంటుంది. తరుచూ మద్యం తాగడం వల్ల కాలేయంపై మచ్చలు, కాలేయ కణాలు బరువెక్కడం, మృదుత్వాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి. కొంత మంది ఎంత డ్రింక్ చేసినా నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తారు. అయితే రోజుకు 30ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంపై పెద్దగా ప్రమాదం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ అలా తాగాలన్నా.. కాలేయం జన్యుపరంగా ఆరోగ్యంగా ఉండాలి.

కాలేయానికి సంబంధించి ఇంతకు ముందు ఎలాంటి సమస్యలు ఉండకూడదు. ఒకసారి మద్యం తాగడం అలవాటుగా మారితే రోజు రోజుకు దాని పరిమాణం పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఆల్కహాల్ ను పూర్తిగా పక్కన పెట్టడం మంచిది. ఆల్కహాల్ తాగడం వల్ల దెబ్బతినే మరో అవయవం మెదడు అందుకే మద్యం అలవాటు ఉన్నవాళ్లు మానసిక సమస్యలను ఎదుర్కొంటారు.

Also Read: White Hair: చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి కారణాలేంటో తెలుసా ?

సడన్ గా ఆల్కహాల్ మానేస్తే ఏమౌతుంది:

ఆల్కహాల్ తాగడం సడన్ గా మానేస్తే కొందరిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీనినే విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అయితే మద్యం హఠాత్తుగా మానేస్తే కొంతమందిలో టెన్షన్, అలసట కనిపిస్తాయి. కొన్నేళ్లు మద్యం తాగి మానేస్తే మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కొంతమంది మద్యం తాగడం మానిస్తే చెవుల్లో పెద్ద, పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. అంతే కాకుండా ఎవరో తమను పిలుస్తున్నట్టు కూడా అనిపిస్తుందట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అని పిలుస్తారు.

ఏళ్ల తరబడి మద్యం తాగి.. ఏదో ఒక కారణంతో తాగడం మానేస్తే వారిలో మూడు రోజుల్లోపు మానసిక సమస్యలు తలెత్తుతాయి. కోపం, ముందు ఏం ఉందో తెలియని పరిస్థితి, అయోమయంలోకి వెళ్లిపోతారు. చాలా మంది సరైన ఆహారం తీసుకోకుండా రేయింబవళ్లు మద్యం తాగుతుంటారు. అలాంటి వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కామెర్లు రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడులో కణజాలాన్ని కూడా ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.

Also Read: పరిగడుపున నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. ఇలా ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలంటే?

ఆల్కహాల్ మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు పెరిగితే ఆ తర్వాతి దశలో అది న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ దశలో వారు అన్నింటినీ మర్చిపోతుంటారు. ఇది ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పేలోపే వారూ ఆ ప్రశ్న అడిగారా లేదా అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

Related News

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Big Stories

×