BigTV English

Charcoal Idli Benefits: చార్‌కోల్ ఇడ్లీ ఏంటీ అనుకుంటున్నారా? తింటే ఎన్ని ప్రయోజనాలో..

Charcoal Idli Benefits: చార్‌కోల్ ఇడ్లీ ఏంటీ అనుకుంటున్నారా? తింటే ఎన్ని ప్రయోజనాలో..

Charcoal Idli Benefits: మనిషికి కావాల్సిన ప్రోటీన్లు, ఫైబర్లు ఇడ్లీ ద్వారా శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇడ్లీని పులియబెట్టిన ఆహారంగా పరిగణిస్తారు. ఇది పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇడ్లీలను తినడం వల్ల బరువు కంట్రోల్ చేసుకోవచ్చు. జీర్ణ సమస్యలు రావు. ఈ కారణంగా చాలా మంది ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్‌లో చాలా మంది ఇడ్లీలు ఉంటాయి. ఇడ్లీలు ఎంత హెల్దీ అంటే.. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన డాక్టర్లు ఇడ్లీలను రోజూ తినమంటారు. అంటే ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అర్థం చేసుకవచ్చు. అలా అని బయటి ఇడ్లీలను తినడం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో తయారు చేసుకుని తినడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండగల్గుతారు.


అయితే ఈ మధ్య కాలంలో నల్లటి ఇడ్లీలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.. అవి ఎంటా అనుకుంటున్నారా? అవేంటే కాదు చార్‌కోల్ ఇడ్లీలు అంటే బొగ్గు ఇడ్లీలు అంటారు. ఈ ఇడ్లీ అనేక ఉపయోగాలను కలిగి ఉందని చెబుతున్నారు.

చార్‌కోల్ ఇడ్లీ ఉపయోగాలు..


విషాలను తొలగిస్తుంది:
చార్‌కోల్ ఇడ్లీ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులను కలిగిస్తుంది. ఇవి విషపదార్థాలను బంధిస్తుందని, శరీరం నుండి తొలగిస్తుంది కొందరు నమ్ముతున్నారు. అలాగ ఇది శరీరంలోకి తీసుకునే ఆహారాల శోషణను కూడా అడ్డుకుంటుందని పలు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఈ ఇడ్లీలు జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుందని, గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇడ్లీకి వాడే పదార్థాలలో ప్రోటీన్లు, కార్బోహైడ్రుట్లు, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, చార్‌కోల్ ఇడ్లీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయడుతుందని తెలిపారు.

చర్మాన్ని తాజాగా ఉంచుతుంది:
చార్‌కోల్ ఇడ్లీలను తినడం వల్ల చర్మం పై ఉన్న మురికి, మలినాలను, నూనెను తొలగించి, చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అలాగే ఇది చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు, మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో చర్మం సహజంగా ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. జిడ్డుగల చర్మం ఉన్నవారు చార్‌కోల్ ఇడ్లీ తినడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

చార్‌కోల్ పొడి తయారీ:
అయితే చార్‌కోల్ పోడి ఏది పడితే అది వాడకూడదు. ఎండిన గొబ్బరికాయలను తీసుకుని బాగా కాల్చాలి. తర్వాత దానిని అవి చల్లగా అయ్యాక బొగ్గుగా మారిన కొబ్బరి ముక్కలను పొడిగా చేసుకోవాలి. అంతే ఇంకా చార్‌కోల్ పోడి రెడీ..

Also Read: టచ్ చేసి చూడు.. అమ్మాయిపై చేయి వేశాడని.. యోగీ మార్క్ ట్రీట్మెంట్

చార్‌‌కోల్ ఇడ్లీలు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
. చార్ కోల్ పోడి- కప్పు
. మినపప్పు- అరకప్పు
. కాస్త ఉప్పు
. ఇడ్లీ రవ్వ- 2 కప్పులు

తయారీ విధానం:
రేపు ఇడ్లీ చేసకోవాలి అంటే ముందు రోజూ సాయంత్రం మినపప్పును నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినపప్పును రాత్రి పడుకునే ముందు మిక్సర్‌లో రుబ్బుకోండి. ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వ తీసుకుని దాంట్లో నీరు పోసుకుని కడగాలి. దీని తర్వాత ముందుగా పట్టిపెట్టుకున్న మినపప్పు పిండిని, తడిపిన ఇడ్లీ పిండిని రెండింటిని బాగా కలపాలి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి అంతే.. ఇలా కలిపి పెట్టిన ఇడ్లీ పిండిని తర్వాతి రోజు అందులో కొద్దిగా చార్‌కోల్ పొడిని బాగా కలిపి ఇడ్లీ మేకర్‌లో పిండిని పోసి, 10-12 నిమిషాలు లేదా ఇడ్లీలు ఉడికే వరకు ఉడికించాలి. చార్‌కోల్ ఇడ్లీలను సాంబర్, చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×