Harry Brook – Prasidh Krishna : ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుబ్ మన్ గిల్ 147, ఓపెనర్ యశస్వి జైస్వాల్ 101, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 134 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్ ప్రసిద్ కృష్ణ తొలి ఇన్నింగ్స్ కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం డకౌట్ వెనుదిరిగాడు. ఇందుకు ఒక కారణం ఉందండోయ్. అదేంటంటే..? ప్రసిద్ కృష్ణ 11 బంతులు ఆడాడు. అయితే హ్యారీ బ్రూక్ ప్రసిద్ కృష్ణ ని సిక్సు కొట్టాలని రెచ్చగొట్టడంతో.. ప్రసిద్ కృష్ణ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నం చేసి బషీర్ బౌలింగ్ లో టోంగ్యూ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
Also Read : Team India: ఆ ముగ్గురు హీరోయిన్లతో బరితెగించి తిరిగిన టీమిండియా ప్లేయర్…?
రెచ్చగొట్టిన బ్రూక్..
ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్లెడ్జింగ్ చేసి మరీ.. సిక్స్ కొట్టాలని ప్రసిద్ కృష్ణను రెచ్చగొట్టడంతో సిక్స్ కొట్టబోయిన అతను బోల్తా పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. ఇప్పటి వరకు ఓపెనర్లు ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నారు. డకెట్ 38, క్రావ్లే 24 పరుగులు చేశారు. 19 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు 68 పరుగులు చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. అయితే టీమిండియా ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ కే.ఎల్. రాహుల్ 137 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ లోటు రాహుల్ వల్ల తీరింది అనే ఫీలింగ్ అభిమానులకు కలిగించాడు.
విజయం ఎవరిదో..?
మరోవైపు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సైతం అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 134, రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేసి అందరి చే ప్రశంసలు అందుకున్నాడు. సాయి సుదర్శన్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడు. ముఖ్యంగా భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, ప్రసిద్ కృష్ణ ముగ్గురు డకౌట్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో ఒకవేళ ఇవాళ ఇంగ్లాండ్ 371 పరుగులు చేస్తే.. విజయం సాధిస్తుంది. లేదంటే భారత్ 10 వికెట్లు తీస్తే.. విజయం వరిస్తుంది. అదేమి జరుగకపోతే.. మ్యాచ్ డ్రా గా ముగుస్తుంది. ఇవాళ జరగబోయే కీలక మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందో.. భారత్ విజయం సాధిస్తుందో అనేది వేచి చూడాలి మరీ.
Harry Brook to Prasidh Krishna – "Can you hit big sixes"
Next ball – "Prasidh Krishna got caught while hitting a six"#INDvsENG pic.twitter.com/8dKFwikNmX
— Richard Kettleborough (@RichKettle07) June 24, 2025