E-Paper
Advertisement

పేరు మార్చుకుంటే నిజంగానే అదృష్టం మారుతుందా?

పేరు మార్చుకుంటే నిజంగానే అదృష్టం మారుతుందా?
Advertisement

Name Numerology:పేరులో ఏముంది అనుకుంటారు కొంతమంది.కానీ పేరు లోనే అంతా ఉంది అనుకుంటారు చాలా మంది. అందుకే తమ పేరులో మార్పు చేర్పులు చేసుకుంటూ ఉంటారు.ఇక వీళ్ళలో సినిమా తారలు, బిజినెస్ చేసే వాళ్ళు అయితే మరీనూ .మరి ఈ మార్పులు జరిగితే నిజంగానే అదృష్టం అంటుకుంటుందా ..తలరాతలు మారిపోతాయా ..మొదలెట్టిన ప్రతీ పనిలో సక్సెస్ దక్కుతుందా ఒకసారి చూద్దాం.

కొంతమంది తమ పేరులో A, H, Y, Kలాంటి అక్షరాలు యాడ్ చేసుకుంటూ ఉంటారు.న్యూమరాలజీ ప్రకారం ఇలా చేస్తే అన్నీ అనుకూలించి మంచి జరిగిపోతుందని నమ్మేస్తారు.అందుకే కొత్త సినిమా మొదలుపెట్టే ముందు, బిజినెస్ ప్రారంభించే ముందు, కొందరు పేరు స్పెల్లింగ్ మార్చుకుంటారు.

అందరికీ సక్సెస్ వస్తుందా?

Advertisement

ఇలా మార్చుకున్న వారందరికీ సక్సెస్ వస్తుందా అంటే సమాధానం దాదాపుగా లేదనే చెప్పాలి.పేరు మార్చుకుని మంచి స్థాయికి వెళ్లిన వాళ్లు ఉన్నారు. అదే సమయంలో పేరు మార్చుకున్నా ఎలాంటి మార్పు రాని వాళ్లు కూడా ఉన్నారు. అలాగే పేరు మార్చుకోకుండా చాలా పెద్ద విజయాలు సాధించిన వాళ్లు కూడా ఉన్నారు.

సైన్స్ ఏం చెబుతోంది?

పేరు మార్చుకుంటే అదృష్టం మారిపోతుందని చెప్పే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు.కానీ ఒక విషయం మాత్రం నిజం. కొత్త పేరు పెట్టుకున్న తర్వాత చాలామందిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. “ఇక నా టైమ్ మొదలైంది” అనే నమ్మకంతో మరింత కష్టపడతారు. దాంతో మంచి ఫలితాలు రావచ్చు.అంటే మార్పు పేరు వల్ల కంటే… మనలో వచ్చే నమ్మకం, కష్టపడే తీరువల్ల కూడా రావచ్చన్నమాట.

Advertisement

పేరు మార్చే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

కేవలం అదృష్టం కోసం పేరు మార్చేయొద్దు. అధికారిక డాక్యుమెంట్లలో మార్పులు చేయాల్సి వస్తుందేమో ఆలోచించండి.మీ కెరీర్‌కు అది ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా చూసుకోండి.న్యూమరాలజీని నమ్మితే నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు

 చివరగా…

పేరు మార్చుకోవడం పూర్తిగా వారి వారి ఇష్టాలని బట్టి ఉంటుంది.దాన్ని నమ్మేవాళ్లు ఉన్నారు, నమ్మనివాళ్లు కూడా ఉన్నారు.కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి…పేరు మీకు గుర్తింపు ఇవ్వొచ్చు. కానీ విజయాన్ని తెచ్చేది మీ కష్టం, మీ ప్రతిభ, మీ పట్టుదల మాత్రమే అన్న సంగతి మర్చిపోవద్దు.అదృష్టం కోసం ఎదురుచూడడం కంటే… మీ లక్ష్యం కోసం కష్టపడితేనే నిజమైన విజయం మీ సొంతమవుతుంది.

also read :వర్షాల్లో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా?.. ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోవద్దు!

Tags

Related News

చూయింగ్ గమ్ నమిలితే క్యాన్సర్ తగ్గుతుందా? అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

కిచెన్‌లో ఈ చిన్న తప్పులే.. నెలాఖరుకి పర్సు ఖాళీ చేస్తాయి!

వర్షాల్లో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా?.. ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోవద్దు!

ఫోన్‌లో సీక్రెట్లు ఉంటేనే గొడవలు.. భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి!

మీ గర్ల్‌ఫ్రెండ్ ఇగోతో విసిగిపోయారా.. ఈ 5 ట్రిక్స్‌తో మీ మన:శాంతి కాపాడుకోండి

లేడీ లక్.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను భర్త ఎంతో గారబంగా చూసుకుంటారు

రాత్రి హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు హై బీమ్ లైట్లతో ఇబ్బందిపడున్నారా? సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు టిప్స్

Big Stories

Advertisement
×