E-Paper
Advertisement

విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. వెనకడుగు వేసిన సంగీత!

విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. వెనకడుగు వేసిన సంగీత!
Advertisement

Vijay – Sangeetha:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి (Vijay Thalapathy), సంగీత (Sangeetha ) జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. పైగా వీరి పెద్దబ్బాయి జేసన్ సంజయ్ (Jason Sanjay) ఇటీవల దర్శకుడిగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా వీరి జీవితంలోకి మరొకరు అడుగుపెట్టడం, దాన్ని తట్టుకోలేక సంగీత తన భర్త నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం అన్నీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటి వల్లే తాను తన భర్తకు విడాకులు ఇస్తున్నాను అంటూ బహిరంగంగా సంగీత ప్రకటించింది కూడా.

సంగీత – విజయ్ విడాకుల కేసులో రోజుకో వార్త..

అప్పటినుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. పైగా విజయ్ అదే సమయంలో తమిళనాడులో టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించి, ప్రచారం చేస్తున్న సమయంలో వ్యక్తిగతంగా ఆయన ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా కొంతమంది సినీ , రాజకీయ ప్రముఖులు కూడా విజయ్ వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఆయనను ఏకంగా ముఖ్యమంత్రిగా గద్దె ఎక్కించారు. అయితే విజయ్ తమిళనాడులో సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది కామెంట్లు చేశారు. దీంతో విజయ్ తల్లి రంగంలోకి దిగి సంగీత – విజయ్ మధ్య సఖ్యత కుదిర్చి సంగీత చేత విడాకుల కేసును వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది అనే వార్తలు గతంలో జోరుగా వినిపించాయి.

రూమర్స్ కి చెక్ పెట్టిన జేసన్ సంజయ్..

Advertisement

మరోవైపు అదే సమయంలో సంగీత తన కొడుకుల్ని తీసుకొని దూరంగా వెళ్లిపోయిందని , విజయ్ ఇక్కడే తన తల్లిదండ్రులతో ఉంటున్నారు అంటూ కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఆధారాలు లేని వార్తలు.. ఎందుకంటే విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఇటీవల తన సిగ్మా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. జేసన్ సంజయ్ మాటలను బట్టి చూస్తే తన తండ్రిపై ఆయనకున్న అపారమైన ప్రేమ మరోసారి బయటపడింది. దీనికి తోడు ఇప్పుడు సడన్గా సంగీత తన విడాకుల కేసును విత్డ్రా చేసుకున్నట్లు సమాచారం.

also read:తండ్రి మరణంపై పూర్ణ ఎమోషనల్ పోస్ట్!

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. 2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి.. విజయ్ తో విడాకులు కావాలి అంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే తాజాగా జరిగిన కేసు విచారణకు ఆమె నేరుగా హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు న్యాయమూర్తికి తెలిపారట. దీనిపై విజయ్ తరపు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో న్యాయస్థానం కూడా కేసును పూర్తిగా క్లోజ్ చేసినట్లు సమాచారం.

విజయ్ పొలిటికల్ కెరియర్ కు శుభవార్త..

అయితే సంగీత ఇలా సడన్గా ఈ పిటీషన్ వెనక్కి తీసుకోవడంపై కారణం అధికారికంగా బయటకు రానప్పటికీ .. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది అనే ప్రచారం మాత్రం జరుగుతోంది. తమిళనాడు సీఎం పదవి లక్ష్యంగా రాజకీయాల్లో వేగంగా అడుగులు వేస్తున్న విజయ్ కి ఈ వివాదం ముగియడం అటు వ్యక్తిగతంగా ఇటు రాజకీయంగా అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచిందని ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు

Related News

“విశ్వనాథ్ అండ్ సన్స్” ట్రైలర్ చూశారా..? చివర్లో ట్విస్ట్ అదిరిపోయింది!

తండ్రి మరణంపై పూర్ణ ఎమోషనల్ పోస్ట్!

చిన్న డైలాగ్.. పెద్ద దుమారం.. ఇదే సోషల్ మీడియా మ్యాజిక్!

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్!

51 ఏళ్లొచ్చినా సింగిల్‌గానే ఉంటా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ‘దందా’ దొర సాయి తేజ సినీ జర్నీ!

‘పళ్ళ బురుసు’ కోసం కోర్టుకెక్కిన పంచాయతీ.. ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Big Stories

Advertisement
×