BigTV English

Weight loss: ఐస్ క్రీమ్ తింటే బరువు తగ్గుతారా? తాజా స్టడీలో ఏం తేలిందంటే?

Weight loss: ఐస్ క్రీమ్ తింటే బరువు తగ్గుతారా? తాజా స్టడీలో ఏం తేలిందంటే?

Weight loss: ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం యూర్బానా-శాంపైన్ నుంచి వచ్చిన తాజా అధ్యయనం డైటింగ్ గురించి మన ఆలోచనలను మార్చేసేలా ఉంది. సాధారణంగా డైటింగ్ సలహాలు బ్రౌనీలు, ఐస్‌క్రీమ్, చిప్స్ వంటి ఎక్కువ కేలరీల ఆహారాలను పూర్తిగా మానమని చెబుతాయి. కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మానేయకపోయినా బరువు తగ్గడం సాధ్యమే అని ఓ పరిశోధన చెబుతోంది.


బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కొందరిపై పరిశోధనలు జరిగాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కేలరీలను ట్రాక్ చేసే డేటా విజువలైజేషన్ టూల్ ఉపయోగించారు. పాల్గొనేవారు తమకు ఇష్టమైన ఆహారాలను తక్కువ మోతాదుల్లో తీసుకోవడానికి అనుమతించారు. ఒక చిన్న చాక్లెట్ ముక్క లేదా కొన్ని చిప్స్ తినడం వల్ల కోరికలు తీరి, అతిగా తినే అవకాశం తగ్గుతుంది.

ఆశ్చర్యకరంగా ఫలితాలు
ఈ అధ్యయనం చెప్పే సంగతి ఏంటంటే, బరువు తగ్గడానికి కేవలం కోరికలను అణచడం కన్నా స్మార్ట్‌గా ఆలోచించి ప్లాన్ చేసుకోవడం ముఖ్యం.


ఎవరైతే 5% కంటే ఎక్కువ బరువు తగ్గారో, వాళ్లలో ఫ్రైడ్ చికెన్, కేక్‌ల వంటి జంక్ ఫుడ్‌పై కోరికలు బాగా తగ్గాయి. పూర్తిగా ఈ ఆహారాలను మానేసిన వాళ్లతో పోలిస్తే, కొంచెం కొంచెం తిన్నవాళ్లు ఎక్కువ బరువు తగ్గారు. ఉదాహరణకు, సక్సెస్‌ఫుల్ డైటర్లు మొదటి సంవత్సరంలో సగటున 12.9% బరువు తగ్గగలిగారు, కానీ ఇతరులు కేవలం 2% మాత్రమే తగ్గారు. ఒకసారి బరువు తగ్గాక, ఆ బరువును 12 నెలల పాటు మెయింటైన్ చేస్తే, జంక్ ఫుడ్‌పై కోరికలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

బ్యాలెన్స్‌డ్ డైట్‌
రెగ్యులర్‌గా తినే అలవాట్లు చాలా కీలకం. సమయానికి సరిగ్గా తినకపోవడం లేదా భోజనం స్కిప్ చేయడం వల్ల ఆకలి పెరిగి, కోరికలు ఎక్కువవుతాయి. బదులుగా, బ్యాలెన్స్‌డ్ డైట్‌లో మీకు ఇష్టమైన ఆహారాలను కొంచెం చేర్చుకుంటే, సంతృప్తి కలుగుతుంది. దీనివల్ల ఆకలితో ఒకేసారి ఎక్కువ తినే సమస్య తప్పుతుంది.

ఒత్తిడి వల్ల క్రేవింగ్స్
స్ట్రెస్ కూడా జంక్ ఫుడ్‌ క్రేవింగ్స్‌కి పెద్ద కారణం. కొందరు బరువు తగ్గినా, స్ట్రెస్ వల్ల చక్కెర, కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారాల కోసం ఆకర్షణ ఉండొచ్చు. అందుకే, డైట్‌తో పాటు మైండ్‌ఫుల్‌నెస్ లేదా కౌన్సెలింగ్ వంటి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్‌లను ఫాలో అవ్వడం బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది.

డైటీషియన్స్ కొన్ని రకాల క్లాసులను అందుబాటులోకి తెస్తున్నారు. దీని ద్వారా ఆహారంలో పోషకాల గురించి, రెగ్యులర్‌గా డైట్ ఎలా ఫాలో చేయాలో నేర్చుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా డైట్ ప్లాన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇది లాంగ్ టర్మ్ సక్సెస్‌కు హెల్ప్ చేస్తుంది.

కేవలం విల్‌పవర్‌తో కోరికలను కంట్రోల్ చేయడం కన్నా, మీకు ఇష్టమైన ఆహారాలను కొంచెం ఎంజాయ్ చేస్తూ, రెగ్యులర్ అలవాట్లు పాటించడం, స్ట్రెస్‌ను మేనేజ్ చేయడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. ఇలా చేస్తే డైటింగ్ సులభమే కాదు, హెల్దీ లైఫ్‌స్టైల్ కూడా అలవాటవుతుంది.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×