BigTV English

Saffron: కుంకుమపువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా?

Saffron: కుంకుమపువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా?

గర్భం ధరించాక బిడ్డ తెల్లగా పుట్టాలని ఎంతో మంది గర్భిణీలకు పాలల్లో కుంకుమ రేకులను కలిపి తాగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు అందంగా పుడతారని తెల్లగా ఉంటారని చెబుతారు. అయితే ఇది నిజమో కాదో ఎంతో మందిలో అనుమానం ఉంది. ఎందుకంటే రంగు అనేది జన్యుపరంగా వచ్చేది. అలాంటిది రంగును కుంకుమపువ్వు ఎలా మారుస్తుంది?


కుంకుమపువ్వు అనేది ప్రపంచంలో ఉన్న అందమైన పుష్పాలలో ఒకటి. కుంకుమపువ్వు మధ్యలో ఎర్రటి రేకులు ఉంటాయి. ఆ రేకులనే మనం ఆహారంలో భాగంగా వాడతాము. వీటిని కుంకుమ రేకులు అని పిలుచుకుంటారు. ఇది ఎరుపు రంగులో ఉంటాయి. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ప్రతి ఒక్కరికి శక్తి అందుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భవతులు ఈ ఎర్రని కుంకుమ రేకులను తినడం వల్ల బిడ్డలు తెల్లగా పుడతారు అన్న వాదన మాత్రం ఎప్పటినుంచో ఉంది. దీనికి సైన్స్ ఎలాంటి సమాధానం ఇస్తుందో తెలుసుకుందాం.

సైన్స్ ఏం చెబుతోంది?
పిల్లలు రంగు ఎలా ఉండాలి అన్నది తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది. అలాగే తాతలు, నానమ్మలు, అమ్మమ్మల రంగు కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అంటే రంగు అనేది పూర్తిగా జన్యు శాస్త్రం పై ఆధారపడి ఉంటుంది. ఒక బిడ్డకు తల్లి రంగు లేదా తండ్రి రంగు రావచ్చు. లేదా రక్తసంబంధం ఉన్న కుటుంబంలో ఎవరి రంగైనా రావచ్చు. అలాంటిదే కుంకుమపువ్వు తినడం వల్ల రంగు మారుతుందన్నది సైన్సు ఒప్పుకోవడం లేదు. కుంకుమ రేకులు అనేది ఒక ఆహార పదార్ధం మాత్రమే. మీరు కుంకుమ రేకులు తిన్నా తినకపోయినా మీ పిల్లల రంగు మారదు… జన్యుపరంగా వచ్చే రంగు కచ్చితంగా వస్తుంది.


కుంకుమ రేకులు ఉపయోగాలు
కుంకుమ రేకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మాత్రం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భవతులు కుంకుమపువ్వు తినడం వల్ల శిశువుకు ఎంతో మంచిది. గర్భంలో ఉన్న బిడ్డకు మంచి పోషణ లభిస్తుంది. ఆ బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశం కూడా ఉంది. అంతే తప్ప బిడ్డ రంగును మార్చే శక్తి కుంకుమపువ్వుకు లేదు. బిడ్డ ఆకారం, పోలిక, రంగు… అన్నీ జన్యు శాస్త్రం పైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి పూర్తిగా తండ్రి పోలికలు తండ్రి రంగు రావచ్చు. లేదా తల్లి పోలికలు తల్లి రంగు రావచ్చు. ఎవరిది వస్తుందో మాత్రం ఊహించలేరు. వైద్యులు కూడా ఎవరి పోలికలు వస్తాయో అంచనా వేయడం పూర్తిగా అసాధ్యం.

గ్రామాల్లో ఇప్పటికీ ఎంతోమంది కుంకుమపువ్వు తింటే పిల్లల రంగు మారుతారని నమ్మకంతో ఉన్నారు. అందుకే గర్భిణీలకు ప్రతిరోజు పాలలో రెండు కుంకుమ రేకులను వేసి ఇస్తూ ఉంటారు. ఇది ఒక నమ్మకం మాత్రమే అంతకుమించి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు.

Also Read: హెయిర్ స్పా అంటే ఏమిటీ? జుట్టు రాలే సమస్యలను ఆపుతుందా? అబ్బాయిలూ చేయించుకోవచ్చా?

కొంతమందికి కుంకుమపువ్వు తినడం సరిపడకపోవచ్చు. అలాగే తెలియక ఎక్కువగా తిన్నా కూడా అలెర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న నమ్మకాలను ఆధారంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో కుంకుమ రేకులను తినేందుకు ప్రయత్నించకండి. వాటిని తినే ముందు డాక్టర్ సలహా తీసుకోండి. ఎంత తినాలో రోజుకు ఎన్నిసార్లు వాటిని తినాలో కూడా తెలుసుకోండి. తగినంత మొత్తంలో మాత్రమే కుంకుమపువ్వు రేకులను తీసుకోవాలి. లేకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఈ కథనం ప్రకారం కుంకుమపువ్వు తింటే పిల్లలు తెలగా పుడతారని చెప్పే ఆలోచన అనేది ఒక సంప్రదాయం మాత్రమే… అని అర్థం చేసుకోవాలి. సైన్స్ దీన్ని నిర్ధారించడం లేదు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం అవసరం. అంతే తప్ప పిల్లల మేని ఛాయ కుంకుమపువ్వే కాదు… ఏ ఆహారమూ మార్చలేదు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×