OTT Movie : ఓటిటిలో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో మైండ్ బ్లాక్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక తండ్రి తన కూతురి తోనే లైంగిక సంబంధం పెట్టుకుంటాడు. ఆ తర్వాత స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది క్వైట్’ (The Quiet). ఈ సినిమాకి జామీ బాబిట్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎలిషా కుత్‌బర్ట్, కెమిల్లా బెల్లె, మార్టిన్ డోనోవన్, ఈడీ ఫాల్కో నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక చెవిటి టీనేజ్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తండ్రి మరణం తర్వాత తన గాడ్‌పేరెంట్స్‌తో కలిసి జీవించడానికి వెళ్తుంది. ఆమె ఈ కొత్త కుటుంబంలో దాగి ఉన్న ఒక చీకటి రహస్యాన్ని కనిపెడుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
డాట్ అనే చెవిటి, మూగ టీనేజ్ అమ్మాయి తండ్రి ఒక ప్రమాదంలో చనిపోతాడు. తల్లీ కూడా లేకపోవడంతో ఆమె తన చిన తండ్రి పాల్ ఫ్యామిలీ తో ఉండటానికి వెళ్తుంది. ఆఇంట్లో పాల్తోపాటు అతని భార్య ఒలివియా, కుమార్తె నీనా ఉంటుంది. డాట్ తన చెవిటితనం వల్ల అందరితో కాలవలేక ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. కానీ ఆమె చుట్టూ జరిగే సంఘటనలను గమనిస్తూ ఉంటుంది. నీనా, డాట్ తో కలిసి ఉండటానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆమె అవిటితనాన్ని హేళన చేస్తూ మాట్లాడుతుంటుంది నీనా. డాట్ తనకి దగ్గర అవుదామని ప్రయత్నించినా దూరం పెడుతుంది. ఇంతలో ఆ ఇంట్లో ఒక రహస్యం బయటపడుతుంది. నీనా తో తన తండ్రి లైంగిక సంబంధం పెట్టుకుంటాడు.ఈ రహస్యం డాట్ కి తెలిసిపోతుంది. డాట్ కి చెవిటి, మూగ ఉండటం వలన ఆమెకు తెలిసే అవకాశం ఉండదనుకుంటాడు పాల్.
ఈ వ్యవహారం కొన్ని రోజులుగా సాగుతూ ఉంటుంది. ఇది అబార్షన్ చేయించే వరకూ వెళ్తుంది. ఈ విషయం నీనా తల్లికి కూడా తెలుస్తుంది. ఆమె డిప్రెషన్ లో బాధపడుతూ అనారోగ్యంగా ఉంటుంది. నిజానికి డాట్ కి చెవుడు మూగ లేదనే అనుమానం కలుగుతుంది నైనా కి. ఆమెను చాలా సార్లు డాట్ ని పరీక్షిస్తూ ఉంటుంది. ఆ తరువాత తన తండ్రి, తనతో పెట్టుకున్న సంబంధానికి బాధపడుతుంది నీనా. ఒక సమయంలో తన తండ్రిని చంపాలని అనుకుంటుంది. ఇంతలోనే డాట్ కి చెవిటి, మూగ లేదని నీనా తెలుసుకుంటుంది. చివరికి నీనా తన తండ్రి మీద రివేంజ్ తీర్చుకుంటుందా ? డాట్ చెవిటి, మూగ లా ఎందుకు నటిస్తుంది ? ఈ విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : క్రూరంగా కోరికలు తీర్చుకునే భర్త … రాత్రయితే వణికి పోయే భార్య