ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న చాలా మంది హెడ్ ఫోన్స్ వాడుతున్నారు. అయితే, హెడ్ ఫోన్స్ వాడటం వల్ల జట్టు రాలుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? నిపుణులు ఈ విషయం గురించి ఏం చెప్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
జుట్టు ఎక్కువ ఒత్తిడికి గురి కావడం వల్ల హెయిర్ ఫాల్ కలగడాన్ని ట్రాక్షన్ అలోపేసియా అంటారు. జుట్టును ఎక్కువ సేపు లాగడం లేదంటే ఒత్తిడికి గురిచేయడం వల్ల జుట్టు రాలుతుంది. టైట్ గా క్యాప్ లు పెట్టుకోవడం, ఎప్పుడూ హెల్మెట్ ధరించడవం వల్ల జుట్టు రాలుతుంది. జుట్టు మీద ఒత్తిడి పెరగడం, గాలి తగలకపోవడం వల్ల కుదుళ్లు బలహీనపడుతాయి. చివరకు జుట్టురాలి బట్టతల ఏర్పడుతుంది. పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్ ఫోన్స్ కూడా నెత్తిని చాలాసేపు అదిమిపట్టి ఉంచడం వల్ల కూడా హెయిర్ ఫాల్ కలిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తారు.
హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందనే విషయంలో కచ్చితమైన నిర్దారణ లేదంటున్నారు నిపుణులు. ఇందుకు సంబంధించి ఎలాంటి సైంటిఫిక్ అధ్యయనాలు లేవు. టైట్ హెడ్ బ్యాండ్స్, టోపీలు, హెల్మెట్లు ఎక్కువ సేపు ధరిస్తే కొన్నిసార్లు ట్రాక్షన్ అలోపేసియాకు కారణమవుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితేచ హెడ్ ఫోన్లు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందని ఏ అధ్యయనం నేరుగా చెప్పలేదు. కొంత మంది హెడ్ ఫోన్లు పెట్టుకుంటే జుట్టు పల్చబడుతుందని చెప్పినప్పటికీ, అవి కేవలం వ్యక్తిగతమే అంటున్నారు నిపుణులు. సో, టైట్ హెడ్ ఫోన్లు నెత్తిమీద ఒత్తిడిని కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, సైంటిఫిక్ గా నిరూపితం కాలేదు.
Read Also: సెటిరిజిన్ మాత్ర తీసుకుంటే నిద్ర ఎందుకు వస్తుంది? ఇది సేఫేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
రోజూ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల జుట్టు పలచబడినట్లు అనిపిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రాక్షన్ అలోపేసియాను ముందుగానే గుర్తిస్తే సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. బిగుతుగా ఉండే హెడ్ ఫోన్లు లేదంటే హెడ్ బ్యాండ్స్ ధరించడం మానేయాలి. హెయిర్ స్పెషలిస్టును కాంటాక్ట్ కావాలి. తగిన చర్యలు తీసుకోవడం వల్ల జుట్టురాలకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది.
సో, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే, హెడ్ బ్యాండ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. టైట్ గా ఉండే హెడ్ బ్యాండ్స్ క్యాప్ లు పెట్టుకోకపోవడం మంచిది. అప్పుడప్పుడు మీ జుట్టును పరిశీలించాలి. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న ప్రదేశంలో ఏదైనా తేడాగా కనిపిస్తే.. కొద్ది రోజులు వాడకపోవడం బెస్ట్. ముందస్తు జాగ్రత్తల కారణంగానే జుట్టును కాపాడుకునే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు.
Read Also: చైనాలో అతి ఎత్తైన వంతెన.. దాని పొడవైన స్తంభాలపై రెస్టారెంట్.. జూమ్ చేస్తేనే చూడగలం!