E-Paper
Advertisement

Kantara Chapter1: మొదటి వారంలోనే రూ. 500 కోట్లు.. కుమ్మి పడేస్తున్న కాంతార1!

Kantara Chapter1: మొదటి వారంలోనే రూ. 500 కోట్లు.. కుమ్మి పడేస్తున్న కాంతార1!
Advertisement

Kantara Chapter1: రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార చాప్టర్ 1(Kantara Chapter1) సినిమా విజయవంతంగా మొదటివారం పూర్తి చేసుకుంది. అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా మొదటి షో నుంచి అద్భుతమైన సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి వారంలోనే ఏకంగా రూ.500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి సంచలనాలను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.509.25 కోట్లు కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.

రూ. 500 కోట్ల క్లబ్ లో కాంతార1..

ఇలా ఈ సినిమా మొదటివారం 500 కోట్ల కలెక్షన్లను రాబట్టిన నేపథ్యంలో ఫిలిం మేకర్స్ ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేస్తూ సినిమా కలెక్షన్ల గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక దీపావళి పండుగ వరకు కూడా ఇతర సినిమాలు విడుదల కానీ నేపథ్యంలో కాంతార1 సినిమాకు మరిన్ని కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు ముందు పాన్ ఇండియా స్థాయిలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి అయితే మొదటి షో నుంచి కూడా ఊహించిన విధంగా అద్భుతమైన టాక్ సొంతం చేసుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది.

ఆలస్యంగా కాంతార2..

Advertisement

ఈ సినిమా కన్నడ సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2022వ సంవత్సరంలో కాంతార సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదట ఈ సినిమా కేవలం ప్రాంతీయ సినిమాగా కన్నడ భాషలో మాత్రమే విడుదలైంది. అక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా కాంతార చాప్టర్ 1 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ యూనివర్స్ నుంచి మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు నటుడు రిషబ్ శెట్టి వెల్లడించారు.

Advertisement

ఇకపోతే కాంతార 2 కథ సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ సినిమా రావడానికి మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణ సంస్థ హోంభళే వారు మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు. ప్రభాస్ సలార్ 2 సినిమాతోపాటు యష్ కే జి ఎఫ్ 3 సినిమాలను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాతనే కాంతార 2 ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడ ఎలాంటి అధికారగా ప్రకటన మాత్రం వెలబడలేదు. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టికు జోడిగా నటి రుక్మిణి వసంత్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం రుక్మిణి వసంత్ సైతం పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: Jr.NTR: ఎన్టీఆర్ కెరియర్ ముగిసిపోయింది.. కమల్ ఆర్ ఖాన్ పై తారక్ ఫ్యాన్స్ ఫైర్!

Related News

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

Big Stories

Advertisement
×