BigTV English

Thandel: అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్.. భారీ రిస్క్ తీసుకుంటున్నారా.?

Thandel: అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్.. భారీ రిస్క్ తీసుకుంటున్నారా.?

Thandel: ప్రతీ హీరో లేదా హీరోయిన్ కెరీర్‌లో వారి మార్కెట్‌కు మించి ఖర్చుపెట్టి తెరకెక్కించిన సినిమా ఒకటి ఉంటుంది. అది కేవలం ప్రేక్షకుల మౌత్ టాక్ వల్లే హిట్ అయ్యి ఆ హీరో లేదా హీరోయిన్ మార్కెట్‌ను మరింత పెంచుతుంది. అలా నాగచైతన్య కెరీర్‌లో తన మార్కెట్ పెంచడానికి వస్తున్న చిత్రమే ‘తండేల్’. ప్రస్తుతం నాగచైనత్యకు హిట్ లేవు, ఫామ్‌లో లేడు. అందుకే ఎలాగైనా ‘తండేల్’ హిట్ అవ్వాలని చైతూకు మాత్రమే కాదు తన మూవీ మేకర్స్ అందరికీ ఉంది. అయితే ఈ సినిమాను ఒక బడ్జెట్ అనుకొని ప్రారంభించగా.. ఆ తర్వాత బడ్జెట్ మరింత మించిపోయి ప్రస్తుతం మేకర్స్ దీని రిలీజ్ కోసం ఎదురుచూసేలా చేశాయి.


బడ్జెట్ గురించి బయటికి

టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ యంగ్ హీరోల్లో నాగచైతన్య ఒకడు. ప్రేమకథలతో యూత్‌కు ఉన్న చైతూ.. అప్పటినుండి కమర్షియల్ హీరోగానే గుర్తింపు కావాలని కష్టపడుతున్నారు. చాలావరకు చైతూ నటించిన కమర్షియల్ సినిమాలు ఏవీ హిట్ అందుకోలేదు. ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న ‘తండేల్’లో మాత్రం లవ్, యాక్షన్ సమపాళల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు నాగచైతన్య. అందుకే ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మెల్లగా ‘తండేల్’ అనేది చైతూ కెరీర్‌లోనే ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిందని చాలామంది ఆడియన్స్ అనుకుంటున్న సమయంలోనే దీని బడ్జెట్ గురించి బయటికొచ్చింది.


మౌత్ టాక్ ముఖ్యం

చందూ మోండేటి దర్శకత్వంలో నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన చిత్రమే ‘తండేల్’ (Thandel). ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. శ్రీకాకుళంలో మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను ముందుగా ఒక బడ్జెట్‌తో తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నారట. కానీ మొత్తానికి సినిమా అయిపోయే సమయానికి దీని బడ్జెట్ రూ.90 కోట్లకు చేరుకుందట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘తండేల్’ గురించే హాట్ టాపిక్ నడుస్తుండగా అందులో ఈ బడ్జెట్ విషయం బయటికి రాగా ప్రేక్షకులు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్‌కు మించిన కలెక్షన్స్ రావాలంటే ‘తండేల్’కు వెంటనే మౌత్ టాక్ మంచిగా రావాలని అనుకుంటున్నారు.\

Also Read: దేవుడా.. నటి ఊర్వశి కూతురిని చూశారా.. హీరోయిన్ రేంజ్ లో ఉందిగా

లెక్కలు వేసుకుంటారు

‘తండేల్’కు అధిక బడ్జెట్ ఖర్చు అయ్యింది అనే విషయంపై దర్శకుడు చందూ మోండేటి (Chandoo Mondeti) కూడా స్పందించాడు. ‘‘నేను కంటెంట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశాను. ఒక్కొక్కసారి బడ్జెట్ విషయంలో లెక్కలు తప్పు అవుతుంటాయి. అల్లు అరవింద్, బన్నీ వాస్ లెక్కల్లో కరెక్ట్ ఉండేవారు. ఎక్స్‌ట్రా బడ్జెట్ అనేది ఎక్కడ నుండి తీసుకురావాలో వారికి తెలుసు. ఒక సీక్వెన్స్‌కు సంబంధించిన ప్రొడక్షన్ డిజైన్ జరుగుతుండగా.. స్క్రిప్ట్‌లో నేను మిస్ అయిన డీటైల్ సినిమాలో చూపించాలని అనుకున్నాను. ఆ సీన్‌ను అప్పటికప్పుడు షూట్ చేయడానికి అల్లు అరవింద్ ఒప్పుకున్నారు. కానీ ఫైనల్ ఔట్‌పుట్ చూసినప్పుడు ఆ సీన్ అనవసరమని కట్ చేయించారు. ఆయనకు ఏం కావాలో క్లారిటీ ఉంది’’ అంటూ ప్రశంసలు కురిపించారు చందూ.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×