BigTV English

Malavika Mohanan: పెళ్లి ప్రపోజల్ పెట్టిన నెటిజన్.. హీరోయిన్ రియాక్షన్ అదుర్స్..!

Malavika Mohanan: పెళ్లి ప్రపోజల్ పెట్టిన నెటిజన్.. హీరోయిన్ రియాక్షన్ అదుర్స్..!

Malavika Mohanan.. ఒకప్పుడు సోషల్ మీడియా వాడకం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందరికీ అత్యంత చేరువలో ఉంటున్నారు. ఇక సామాన్యులు అయితే.. ఏకంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి కూడా తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నారనటంలో సందేహం లేదు. అటు సెలబ్రిటీలు కూడా తమ లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.ఇక ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది హీరోయిన్స్ ఏకంగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ వారి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ నిర్వహించింది ప్రముఖ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan).


జాంబీగా మారితే ఆయన పక్కనే ఉంటా – మాళవిక

మాళవిక మోహనన్.. విజయ్ (Vijay) ‘మాస్టర్’, విక్రమ్ (Vikram) ‘తంగలాన్’ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన ఈమె.. నేరుగా తెలుగులో చేస్తున్న చిత్రం రాజా సాబ్ (Rajasaab). ప్రభాస్ (Prabhas)సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈమె, ఈ సినిమాతోనే నేరుగా తెలుగులో నటిస్తూ..తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతోంది. ఈ క్రమంలోనే తన మొదటి సినిమా రాజా సాబ్ విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ తో ప్రభాస్ పక్కన నటించిన ఈమె.. ప్రభాస్ సెట్ లో అందరికీ ఫుడ్ పెట్టే విధానం గురించి చెబుతూనే నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం తెలిపింది. చిట్ చాట్ లో భాగంగా ఒక నెటిజన్ మీరు జాంబీగా మారిపోతే.. ఏ హీరో పక్కన ఉంటారు? అని అడగ్గా.. దానికి ఆమె ప్రభాస్ పేరు చెప్పింది. “ప్రభాస్ ఐతే పక్కనున్న వారికి సరిపోయేంత ఫుడ్ తీసుకొస్తాడు. జాంబీ గా మారినప్పుడు.. ఆయన పక్కన ఉంటే నేను ఫుడ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు”. అంటూ సరదాగా మాళవిక సమాధానం చెప్పింది.


పెళ్లి చేసుకుంటానన్న నెటిజన్.. హీరోయిన్ దిమ్మతిరిగే కౌంటర్..

ఇక మరొక నెటిజన్ కాస్త ఒక అడుగు ముందుకు వేసి.. “మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.. మీరు కలలుకనే భర్త, మంచి భర్తగా ఉండేందుకు ఏం చేయాలో చెప్పండి?” అంటూ ప్రశ్నించగా.. మాళవిక అదిరిపోయే రిప్లై ఇచ్చింది.” నేను ఇప్పట్లో పెళ్లికి సిద్ధంగా లేను. ఇప్పుడు నాకు ఎటువంటి భర్త అవసరం లేదు” అంటూ ఆ నెటిజన్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పిన నెటిజన్ కి సరైన సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది మాళవిక అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మాళవిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక చిట్ చాట్ లో భాగంగా మీకు ఇష్టమైన సినిమా ఏంటని అడగగా..’ 96 ఫిలిం’ అంటే ఇష్టం అని చెప్పిన ఆమె, తన నిక్ నేమ్ కూడా చెప్పుకొచ్చింది. తనను ఇంట్లో వాళ్లు , దగ్గర వాళ్లు అందరూ :మల్లు’అని పిలుస్తారని తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో ‘రాజా సాబ్’ తో పాటూ తమిళంలో ‘సర్ధార్-2’, మలయాళం లో ‘హృదయపూర్వం’ అనే సినిమాలు చేస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×